వైభవంగా హేమా మాలిని కుమార్తె వివాహం

వైభవంగా హేమా మాలిని కుమార్తె వివాహం

నిన్నటితరం బాలీవుడ్ స్టార్స్ హేమామాలిని, ధర్మేంద్రల కుమార్తె ఇషా డియోల్ వివాహం శుక్రవారం ఉదయం ముంబైలో అంగరంగం వైభవంగా జరిగింది. తన ప్రియుడు, వ్యాపార వేత్త భరత్ తక్తానీని ఇషా పెళ్లాడింది. దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సంవత్సర కాలంగా ఇషా భరత్ తక్తానీతో డేటింగ్ చేస్తోంది.

2002లో ‘కోయి మేరా దిల్ సే పూచె' అనే చిత్రం ద్వారా బాలీవుడ్ టెరంగ్రేటం చేసిన ఈభామ ‘ధూమ్' లాంటి భారీ చిత్రాల్లో నటించినా...తల్లి మాదిరి స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకోలేక పోయింది. తమ పిల్లల్ని ప్రమోట్ చేసుకోవడం కోసం హీరోలు రిస్క్ చేసి, సినిమాలు నిర్మిస్తూ వుంటారు. అయితే ఈషా విషయంలో మాత్రం ఇది రివర్స్. తన కూతుర్ని హీరోయిన్ గా నిలబెట్టడం హేమమాలిని చాలా ట్రై చేసింది.

సినిమాలు లేక ఖాళీగా వున్న తన కూతురు ఈషా డియోల్ ను ప్రమోట్ చేయడం కోసం 'టెల్ మీ ఓ ఖుదా" పేరుతో హేమ ఓ చిత్రాన్ని నిర్మించింది. కనపడకుండా వెళ్లిపోయిన తండ్రి కోసం అన్వేషించే ఓ తనయ కథ నేపథ్యంలో ఆచిత్రాన్ని నిర్మించారు. అయితే ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న అంచనాలను చేరుకోలేక పోయింది. దీంతో సినిమాలకు టాటా చెప్పి పెళ్లి చేసేసుకుంది ఈ భామ.