బంతి ఇప్పుడు రామ్ చరణ్ కోర్టులో.

బంతి ఇప్పుడు రామ్ చరణ్ కోర్టులో.

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం రీమేక్‌లో నటించాలని రామ్ చరణ్ ఉవ్విల్లూరుతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మెగా నిర్మాత అశ్వినీదత్ ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందని స్వయంగా ప్రకటించారు.

ఇలా ప్రకిటించడం ద్వారా బంతిని రామ్ చరణ్ కోర్టులోకి నెట్టారు నిర్మాత అశ్వీదత్. ఆ చిత్రం రీమేక్‌లో రామ్ చరణ్ తప్ప మరొక చేయలేరని, రామ్ చరణ్ నటిస్తేనే ఆచిత్రానికి క్రేజీ వస్తుందనేది కాదనలేని సత్యం. మరి రామ్ చరణ్ నిర్ణయంపైనే ఇప్పుడు ఆ చిత్రం రీమేక్ ఆధార పడిఉంది.

ప్రస్తుతం రామ్ చరణ్ తన బాలీవుడ్ తొలి మూవీ ‘జంజీర్' చిత్రంతో పాటు వివి వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం హనీమూన్ ఎంజయ్ చేయడానికి భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ వాటికన్ సిటీ వెళ్లారు. ఆయన వచ్చాకగానీ తెలియదు అశ్వినీదత్ ప్రకటనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

మాటీవీ వారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చిన సందర్భంగా తన మనసులోని మాటను బయట పెట్టారు నిర్మాత అశ్వినీదత్. రాఘవేంద్రరావు తమ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. ఆయనతో కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం రీమేక్ చేయాలని ఉందని వెల్లడించారు అశ్వినీదత్. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాతగా రూపొందించిన 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది.