‘గబ్బర్ సింగ్' 5 వీక్స్ షేర్ ఎంతంటే..?

‘గబ్బర్ సింగ్' 5 వీక్స్ షేర్ ఎంతంటే..?

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగిస్తూనే ఉంది. అంచనాలకు మించిన కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈచిత్రం మెగా అభిమానుల దాహాన్ని తీర్చింది. తాజాగా ఈ చిత్రం ఐదు వారాలు పూర్తి చేసుకుని రికార్డు లెవల్లో షేర్ వసూలు చేస్తూ దూసుకెలుతోంది. ఈ చిత్రం పవర్ స్టార్‌తో పాటు దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ కెరీర్‌కి మంచి సపోర్టునిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం గడిచిన 5 వారాల్లో రూ. 71.16 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఏరియా వారిగా ఈచిత్రం సాధించిన షేర్ విషయానికొస్తే...

నైజాం - 19.10 కోట్లు

సీడెడ్ - 8. 96 కోట్లు

వైజాగ్ - 5.08 కోట్లు

ఈస్ట్ - 3.98 కోట్లు

వెస్ట్ - 3.28 కోట్లు

కృష్ణా - 3.34 కోట్లు

గుంటూరు - 4.58 కోట్లు

నెల్లూరు - 2.21 కోట్లు

ఏపీ టోటల్ 5 వీక్స్ షేర్ - 50.53 కోట్లు
కర్ణాటక - 5.3 కోట్లు

రెస్టాఫ్ ఇండియా - 3.18 కోట్లు

ఓవర్సీస్ - 12.15 కోట్లు

వరల్డ్ వైడ్ 5 వీక్స్ షేర్ కలెక్షన్: రూ. 71.16 కోట్లు(ఆల్ టైం రికార్డ్)

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన  గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు,