తెలుగు హీరోతో నయనతార ఎఫైర్?

తెలుగు హీరోతో నయనతార ఎఫైర్?

ఎప్పుడూ ఎవరో ఒకరితో ఎఫైర్ తో ముడిపెడుతూ హాట్ గా మీడియాలో ఉండే హీరోయిన్ ఎవరూ అంటే నయనతార అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రభుదేవాతో విడిపోయిన నయనతార తాజాగా ఓ తెలుగు హీరోతో బాగా ఇంటిమసీ ఉంటోందని ఫిల్మ్ నగర్ లో టాక్. వీరిద్దరూ అర్దరాత్రిళ్లు వరకూ కలిసే తిరుగుతున్నారని, వారిద్దరి మధ్యా ఎఫైర్ మొదలైందంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఆ హీరోపై టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు

 

నయనతార తన లవ్ ఎఫైర్ ఘోర పరాజయం పొందటంతో ఆమె ఓ విధమైన డల్ మూడ్ నుంచి బయటపడటానికి అతను సాయపడుతున్నాడని అంటున్నారు. అయితే వీరిద్దరి మధ్యా అలాంటిదేమీ లేదని కొందరు వారి సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉంటే తమిళంలో ఆర్యతో ఆమె ప్రేమ వ్యవహారం నడుపుతోందంటూ మరో వార్త అక్కడ మీడియాలో ప్రసారమైంది. అజిత్‌, ఆర్య కలసి నటిస్తున్న ఓ చిత్రంలో నయన్‌ నటించడానికి ఒప్పుకొన్నారు. నయనతార మరోసారి ప్రేమలోపడ్డారా..? అని ఓ టీవీ ఛానెల్ ఓ ప్రత్యేకమైన పోగ్రాం చేసింది. ఈ కేక్ క్లిప్పింగ్ లు చూపుతూ. అది హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ విషయమై ఆర్య స్పందిస్తూ ''నయనతార, నేను మంచి స్నేహితులం. ఇద్దరం బాస్‌ ఎన్గిర భాస్కరన్‌ చిత్రంలో నటించాం. మా మధ్య ప్రేమ లేదు. ఆమె కొన్ని ఇబ్బందుల నుంచి తిరిగొచ్చారనే ఉద్దేశంతో కేకుపై అలా రాసి స్వాగతించాను. గృహ ప్రవేశ వేడుకకి నయనతారను మాత్రమే కాదు చాలామంది నటీనటులను కూడా ఆహ్వానించాను'' అన్నారు.

ప్రస్తుతం   తెలుగులో నాగార్జున, దశరథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడు.