చెర్రీ పెళ్లికి జూ.దంపతులు

చెర్రీ పెళ్లికి జూ.దంపతులు

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ - ఉపాసనల వివాహానికి గురువారం ఉదయం సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. గండిపేట టెంపుల్ టీ ఫామ్ హౌస్‌లో వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పెళ్లి మంటపం కళకళలాడుతోంది. ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే లోనికి అనుమతించారు. బాలీవుడ్, దక్షిణాది తారలు పలువురు వచ్చారు.

శ్రీదేవి, బోనీ కపూర్, మురళీ మోహన్, పవన్ కల్యాణ్, నాగబాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, రాఘవేంద్ర రావు, అశ్వనీదత్, కెఎస్ రామారావు, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, వేణుమాదవ్ బ్రహ్మానందం, శ్రీకాంత్, ఊహ, రామానాయుడు, కోడి రామకృష్ణ, దగ్గుపాటి రానా, కోట శ్రీనివాస రావు, కైకాల సత్యనారాయణ, బోయపాటి శ్రీను తదితరులు నటీనటులు, దర్శక, నిర్మాతలు వచ్చారు.

గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సుబ్బి రామి రెడ్డి, జానా రెడ్డి, గీతా రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సి.రామచంద్రయ్య, వి.హనుమంత రావు, మధుయాష్కీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, హర్ష కుమార్, కెసిఆర్ తదితరులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని టెంపుల్ ట్రీ ఫాంహౌస్‌లో పూర్తి సాంప్రదాయబద్దంగా వివాహం జరుగుతోంది. ఇరువురు బంధువులు మండపానికి చేరుకున్నారు.

కాగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ బుధవారమే తన ప్రత్యేక దూత ద్వారా పూల బోకే పంపించారు. ఈ పెళ్లికి వివిధ రంగాలకు చెందిన మూడువేల మందికి మాత్రమే ఆహ్వానాలు ఉన్నాయి. సాయంత్రం హైటెక్స్ లోని నోవాటెల్‌ హెటల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.