ఇప్పటి వరకు చరణ్ రచ్చ' బిజినెస్ ఎంత?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రచ్చ' మాస్ కమర్షియల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం బిజినెస్ దాదాపుగా క్లోజింగ్ దశలో ఉంది. పలు రికార్డులు బద్దలు కొడుతూ సాగిన రచ్చ' చరణ్ కెరీర్లో మగధీర తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. మెగా కుటుంబానికి చెందిన చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 127 థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్ని రచ్చ చిత్రం....ముఖ్యమైన థియేటర్లలో ఈ చిత్రం వంద రోజుల దిశగా దూసుకెలుతోంది.
ప్రఖ్యాత వెబ్ సైట్ వికీ పీడియాలో ఉన్న వివరాల ప్రకారం...ఈ చిత్రం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.....బాక్సాఫీసు వద్ద రూ. 111.4 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు రచ్చ' చిత్రం ఏరియా వైజ్‌గా సాధించిన షేర్ డీటేల్ష్ క్రింది విధంగా ఉన్నాయి(ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది)
నైజాం: 12.60 కోట్లు
సీడెడ్: 8.48 కోట్లు
నెల్లూరు: 2.03 కోట్లు
కృష్ణ: 2.60 కోట్లు
గుంటూరు: 4.37 కోట్లు
వైజాగ్: 4.47 కోట్లు
ఈస్ట్: 2.87 కోట్లు
వెస్ట్: 2.52 కోట్లు
టోటల్ ఏపీ: 39.94 కోట్లు
కర్నాటక: 4.80 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1.50 కోట్లు
ఓవర్సీస్: 4.00 కోట్లు
వరల్డ్ వైడ్ ఫుల్ రన్ షేర్: 50.24 కోట్లు
* రగలై ( రచ్చ తమిళ వెర్షన్): 4.90
* రక్ష (మళయాలం వెర్షన్): రూ. 1.00
రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి సమర్పకులు కాగా, ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి.