ప్రాణాలతో బయటపడ్డ స్నేహ!

 ప్రాణాలతో బయటపడ్డ స్నేహ!

ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకున్న  హీరోయిన్ స్నేహ ఇటీవల సముద్రంలో జరిగిన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. స్నేహ తమిళంలో నటిస్తున్న ‘హరిదాస్' అనే చిత్రం షూటింగ్ నిమిత్తం తమిళనాడు తీరంలోని ధనుష్ కోటి ప్రాంతంలో సముద్రంలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. స్నేహ, ఆమె కోస్టార్ కిషోర్‌లపై పాట చిత్రీకరణ జరుగుతోంది.

షూటింగ్ ముగిసాక తిరిగి బోట్లో వస్తుండగా ఓ శక్తివంతమైన అల వారి బోటు తాకడంతో పడవ బోల్తా పడింది. అయితే స్నేహ లైఫ్ బోట్ సహాయంతో నీటిలో తేలియాడగా.... సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఇతరులు సముద్రంలో దూకి స్విమ్ చేయడం మొదలు పెట్టారు. వెంటనే సమీపంలోని మత్స్యకారులు వచ్చి వారిని రక్షించారు. మొత్తానికి స్నేహ, ‘హరిదాస్' సినిమా యూనిట్ సభ్యులంతా క్షేమంగా చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

స్నేహ-ప్రసన్నల వివాహం మే 11న వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. 'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి ద్వారా ఓ ఇంటివారయ్యారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. ఇరకపై నటించే విషయమై స్నేహదే తుది నిర్ణయమని ప్రసన్న ఫ్రీడం ఇవ్వడంతో...మళ్లీ సినిమాల్లోనటిస్తోంది స్నేహ.