పెళ్లికి వినాయక్‌ ఎమేజింగ్ గిప్ట్

 పెళ్లికి వినాయక్‌ ఎమేజింగ్ గిప్ట్

ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ తన హీరో రామ్ చరణ్ కి ఓ ఆశ్చర్యకరమైన బహుమతిని అందజేశి ఆనంద పరిచారు. రామ్ చరణ్ వివాహ వేడుకులకు హాజరైన వినాయిక్ పెళ్లి కొడుకుని ఆశీర్వదించి ఆయన చేతిలో ఓ సర్టిఫికెట్‌ని పెట్టారు. అదేమిటో అర్దం కాక రామ్ చరణ్, ఆయన తండ్రి చిరంజీవి అడిగితే 'మా హీరోకి ఓ మేలు జాతి అశ్వాన్ని ఇస్తున్నాను. అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌' అని వినాయక్‌ తెలిపారు.

'మగధీర' చిత్రంలో చరణ్‌ ఓ గుర్రం మీద స్వారీ చేశారు. ఆ జాతికి చెందినదే ఇప్పుడు బహుమతిగా ఇచ్చినది కూడా. గుజరాత్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. దాని వయసు 30 నెలలు. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మిగతా దర్శకులు తమ హీరోకు ఏ గిప్ట్ ఇచ్చి ఆనందపరచాలా అని ప్లాన్స్ చేసుకుని రెడీ అయ్యి పెళ్లి మండపం చేరుకుంటున్నారు.

ఉపాసన- రామ్‌చరణ్‌ వివాహం సందర్భంగా అటు టాలీవుడ్‌, ఇటు బాలీవుడ్‌ ప్రముఖులు వస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు నాగబాబు కొన్ని సూచనలు చేశారు. తమ బిడ్డల్ని ఆశీర్వదించడానికి రమ్మనీ, కానీ ఎటువంటి గిఫ్ట్‌లుతీసుకుర్ణావొద్దని చెప్పారు. ఈ రోజు అంటే గురువారం 14వతేదీన ఉపాసన వివాహం గండిపేట రిసార్ట్స్‌ ప్రాంగణంలో ఉదయం 7.30గంటలకు జరుగుతుంది. రేపు అంటే జూన్‌ 15న అభిమానులకు పెండ్లి జరిగే ప్రాంతంలోనే రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

కల్యాణ మంటపానికి వధూవరుల కుటుంబీకులు బుధవారం అర్ధరాత్రే చేరుకున్నారు. ఇక్కడే వధూవరులను అలంకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల వరకు పెళ్లి సందడి ఉంటుంది. అతిథులకు అల్పాహారం అందించేందుకు పలు రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంగణంలో రిసెప్షన్‌ ఉంటుంది. ఈ విందుకు సంబంధించిన ఏర్పాట్లను చిరంజీవి కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 10 వేల మంది హాజరవుతారని అంచనా.

కేవలం వథూవరుల్ని ఆశీర్వదించడానికే రావాలనీ, ఎటువంటి బహుమతులు తీసుకురాకూడదని సూచించారు. ఖమ్మం జిల్లాలోని అభిమానులు ముత్యాలతలంబ్రాలను భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీసుకు వస్తున్నారు.