బండ్ల గణేష్‌పై దాడి..హాస్పటల్ పాలు

బండ్ల గణేష్‌పై దాడి..హాస్పటల్ పాలు

పవన్ కళ్యాణ్ తో రీసెంట్ గా'గబ్బర్ సింగ్'చిత్రం తీసి ఘన విజయం సాధించిన బండ్ల గణేష్ పై దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సాగర్‌ హైవే వద్ద గణేష్ కి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరగింది. వివరాల్లోకి వెళితే..ఆగపల్లి హైవేపై బండ్ల గణేష్‌ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్ర గాయలయ్యాయి.

ఇది గమనించి ఆగ్రహించిన బాధితుని బంధువులు, స్థానికులు గణేష్‌పై దాడికి పాల్పడ్డారు. గాయపడిన గణేష్‌ను కామినేని ఆసుపత్రికి తరలించారు. కారు ఢి కొనడంతో గాయపడ్డ వ్యక్తిని కూడా సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఖుషీ తర్వాత పదేళ్ల అనంతరం ఆ రేంజి హిట్ కొట్టారు పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటున్న నేపధ్యంలో గణేష్ కి మరో సినిమా కి డేట్స్ ఇస్తానని పవన్ ప్రామిస్ చేసాడని సమాచారం. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఆ చిత్రం చేస్తానని చెప్పారని సమాచారం. అయితే ఆ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం షూటింగ్ పూర్తయ్యాక చేద్దామని,ఈ లోగా..కథ,దర్సకుడు పైనలైజ్ చేద్దామని చెప్పారని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

గణేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్లతో చిత్రం చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందే ఈ చిత్రం టైటిల్ బాద్షా. పూర్తి కామెడీ ఎంటర్ట్నైమెంట్ తో రూపొందే ఆ చిత్రం మళ్లీ గబ్బర్ సింగ్ రేంజి సినిమా అవుతుందనే నమ్మకంగా ఉన్నారు. అఫ్పుడే బాద్షా చిత్రానికి బిజినెస్ ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉన్నాడు గణేష్. నెల్లూరు నుంచి మొదట అడ్వాన్స్ ఇచ్చి డిస్ట్రిబ్యూటర్స్ ఫైనలైజ్ చేసుకున్నారు. దూకుడు తర్వాత శ్రీను వైట్ల చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.