‘ఈగ' మూవీ సెన్సార్ రిపోర్టు

‘ఈగ' మూవీ సెన్సార్ రిపోర్టు

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఈగ' చిత్రం ఈ రోజు(జూన్ 26) సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ఎలాంటి కత్తిరింపులు లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేశారు. చిత్రంలో కొన్ని స్మోకింగ్ సీన్లు ఉండటం వల్ల ఈచిత్రానికి U/A రేటింగ్ ఇచ్చారకు. అవిలేకుంటే పూర్తిగా క్లీన్ చిట్ వచ్చేదని, అయితే కథానుగునంగా అవి తప్పనిసరి కావడంతో వాటిని అలానే ఉంచారు. ఈ విషయమై రాజమైళి ఈ విషయాన్ని తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా స్వయంగా వెల్లడించారు.

‘ఈగ' చిత్రం విడుదలకు ముందు స్టోరీ మొత్తం చెప్పేసిన దర్శకుడు రాజమౌళి....తన డైరెక్షన్‌ సత్తాను చాటుకున్నాడు. ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా ‘ఈగ' కథాంశం.

సైన్స్ ఫిక్షన్, విజువల్ వండర్ గా రూపొందిన ఈ మూవీ జులై 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈచిత్రం రెండు నెలల ముందే విడుదలవ్వాల్సి ఉండగా అనుకోని కారణాలతో విజువల్ ఎఫెక్ట్స్ లేట్ కావడంతో వాయిదాల మీద వాయిదాలే వేస్తూ చివరకు జులైలో డేట్ ఫిక్స్ చేశారు. ఆడియో విడుదలైన తర్వాత దాదాపు వందరోజుల గ్యాప్ తీసుకున్న ‘ఈగ' చిత్రం థియేటర్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.