టెన్షన్ లో చిరు మేనల్లుడు

టెన్షన్ లో చిరు మేనల్లుడు

చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా వైవియిస్ చౌదరి ఆల్రెడీ రేయ్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం మొదలయ్యి చాలా కాలం అయినా అతీ గతీ లేనట్లుగా అయ్యింది. నిప్పు సినిమాతో చేతులు కాల్చుకున్న వైవియస్ చౌదరి అతి కష్టం మీద ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా షెడ్యూల్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు ఈ చిత్రం పూర్తై రిలీజ్ అవుతుందనే విషయంలో స్పష్టత లేదు. మరో ప్రక్క చిత్రం బాగా లేటవటంతో ట్రేడ్ లో ఆసక్తి కూడా తగ్గిపోయింది. వైవియస్ చౌదరికి సైతం మార్కెట్లో ఇప్పుడు అస్సలు క్రేజ్ లేదు. దాంతో ధరమ్ తేజ లో టెన్షన్ స్టార్టైందని వినికిడి. వేరే ప్రాజెక్టులు ఓకే చేయాలని ఆలోచిస్తున్నాడని చెప్తున్నారు.

మరో ప్రక్క ఈ చిత్రం పూర్తికాకముందే ఈ యంగ్ హీరోకి మరో అవకాశం వచ్చింది. దిల్ రాజు,అడవి సాయి కిరణ్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న కేరింత చిత్రంలోనూ సాయి ధరమ్ తేజనే హీరోగా తీసుకున్నట్లు సమాచారం. మొదట నాగచైతన్యను హీరోగా అనకున్నా డేట్స్ ఎడ్జెస్టు కాకపోవటంతో చాలా లేటయ్యేటట్లు ఉండటంతో సాయి ధరమ్ తేజను తీసుకున్నట్లు తెలుస్తోంది.


వినాయకుడు తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

'హ్యాపీ డేస్' చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మిక్కీ జె మేయర్ ఆ తరవాత 'కొత్తబంగారు లోకం' చిత్రానికి చేసారు.అనంతరం మళ్లీ శేఖర్ కమ్ములతోనే 'లీడర్' కి చేసారు. 'లీడర్' ఆడియో అనుకున్నంత హిట్ కాకపోవటంతో ఆ తరవాత ఏ సినిమాను కమిట్ కాలేదు. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా చెబుతున్న 'కేరింత' సినిమా నటి నటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తిచేసుకుని అక్టోబర్ లో సెట్స్ ఫైకి వెళ్ళనుంది. ఇక దర్శకుడు అడవి సాయికిరణ్ ..విలేజ్ లో వినాయకుడు చిత్రం అనంతరం ఏ సినిమానూ చేయలేదు. ఇక ఈ చిత్రానికి కెమెరామెన్ గా కుదిరితే కాఫీ కప్పు చిత్రాన్ని డైరక్ట్ చేసిన రమణ సెల్వా పనిచేయనున్నారు.

రేయ్ చిత్రం విషయానికి వస్తే...ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన కొంత భాగాన్ని లాస్ వెగాస్, అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో చిత్రీకరించారు. వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2012 చివరికల్లా వైవిఎస్ ఈచిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది.