అది వట్టి రూమరే.... నయనతార లేదు!

అది వట్టి రూమరే.... నయనతార లేదు!

 కడల్ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను ఆఫర్ చేసారని, ఆమె వెంటనే ఓకే చేసిందని, స్క్రిప్టు, తన పాత్ర ఏమిటి అని అడగకుండా మరీ మణిరత్నం చిత్రాన్ని ఆమె ఒప్పుకుందని చెన్నై వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.

అయితే తాజాగా ఆ వార్తలన్నీ వట్టి రూమర్లే అని తేలి పోయింది. నయనతార  మణిరత్నం ‘కడల్' చిత్రంలో నటిస్తుందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని యూనిట్ సభ్యులు అంటున్నారు. కడల్ చిత్రంలో హీరోగా కార్తీక్ కుమారుడు గౌతమ్ పరిచయం అవుతున్నాడు. అలాగే ఒకప్పటి హీరోయిన్ రాధ రెండో కుమార్తె తులసి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

ప్రస్తుతం నయనతార పలు తెలుగు, తమిళం ప్రాజెక్టులో బిజీగా గడుపుతోంది. నాగార్జున, దశరత్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ' చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవే కాకుండా రాణా హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది.

గోపీచంద్, నయనతార కాంబినేషన్ లో భూపతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మరో వైపు ‘భూలోగం' అనే తమిళ చిత్రానికి సంబంధించి ఇటీవలే దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. ఈ చిత్రం ద్వారా కళ్యాణ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

తిరిగి సినిమాల్లోకి వస్తున్నాను అని నయనతార ప్రకటించిందే ఆలస్యం ఆమె ముందు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. అందిరిపోయే అందం, చక్కని అభినయం, యూత్‌ మతి పోగొట్టే హొయలు ఆమె సొంతం మరి. అందుకే నయనకు డిమాండ్ ఇంకా కొనసాగుతోంది.