పోటీకి ఊగిసలాట ఎందుకు?

 పోటీకి ఊగిసలాట ఎందుకు?

 రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డియే) ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తోంది. అసలు అలాంటి ఊగిసలాట ఎందుకునేది ప్రశ్న. యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని ఎదుర్కునే విషయంలో ఎన్డియె వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో తమకు తగినన్ని ఓట్లు ఉన్నప్పటికీ పోటీ సరైంది కాదనే భావన యుపిఎలో ఎందుకు ఉందనేది కూడా ప్రశ్ననే.  ప్రణబ్ ముఖర్జీ స్థాయికి పోటీ జరగడం సరైంది కాదా అనేది మరో ప్రశ్న.

తమకు మెజారిటీ ఓట్లు ఉన్నాయని యుపిఎ భావిస్తున్నప్పటికీ పోటీ అనే ఒత్తిడిని ఎదుర్కోవాలనేది పై ప్రశ్నలకు ఒక సమాధానం. అంతర్గతంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు కాంగ్రెసుకు అనుకూలంగా కనిపించడం లేదు. దేశంలో అవినీతి వ్యతిరేక భావన పెరిగింది. పార్టీ పంథాకు కట్టుబడకుండా ప్రజాప్రతినిధులు ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే భావన ఉంది.

అయితే, అదేం పెద్ద అంశం కాదు. దానిపై చర్చించాల్సిన కీలకమైన అంశం మరోటి ఉంది. అది రాష్ట్రపతి కార్యాలయం ప్రతిష్టకు సంబంధించింది. మనది ఏకఛత్రాధిపత్య రాజ్యాంగం కాదు. భవిష్యత్తు రాష్ట్రపతి విషయంలో ప్రధానమైన అంశాలు ముందుకు వస్తాయి.

356 ఆర్టికల్‌ అమలు, హంగ్ పార్లమెంటు, ప్రశ్నార్థకమైన బిల్లుల వంటి అసాధారణమైన రాజ్యాంగ పరిస్థితిలో రాష్ట్రపతి శైలి ఏ రకంగా ఉంటుందనేది మొదటి. ఉగ్రవాదులకు మరణశిక్ష విధించిన స్థితిలో మెర్సీ పిటిషన్లపై రాష్ట్రపతి ఏ విధంగా వ్యవహరిస్తారనేది రెండోది. రాజ్యాంగం విధించిన పరిమితుల్లో రాష్ట్రపతి క్రియాశీలకంగా ఉండాలా, పాసివ్‌గా ఉండాలా అనేది మూడోది.

మామూలు ప్రజానీకానికి సంబంధించినంత వరకు అవి ముఖ్యమైన విషయాలు కాకపోవచ్చు గానీ అవే ప్రధానమైనవనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. కీలకమైన స్క్రూటినీ లేకపోవడంతో మెర్సీ పిటిషన్ల విషయంలో అత్యవసర పరిస్థితి విధించే విషయంలో ద్వంద్వ వైఖరులు రాష్ట్రపతి కార్యాలయం అనుసరించడం మన అనుభవంలో ఉంది.

అత్యంత ముఖ్యమైన విషయం రాజకీయపరమైంది. తమ భాగస్వామ్య పక్షాలు అభ్యర్థిని పెడితే ఎంత వరకు మద్దతు ఇస్తాయి, ఎంతవరకు ఇవ్వనే స్పష్టత ఎన్డియెకు లేదు. అభ్యర్థి భాగస్వామ్య పక్షాలకు ఆమోదయోగ్యం అవుతాడా కాదా అనేది అసలు విషయం. అర్థవంతమైన పోటీకి బిజెపి నాయకత్వంలోని ఎన్డియె దిగితేనే మంచిది, టోకన్ ఫైట్ మాత్రం మంచిది కాదు.