కార్తీ ‘శకుని' ఆడియో రిలీజ్ విశేషాలు

కార్తీ ‘శకుని' ఆడియో రిలీజ్ విశేషాలు

కార్తీ, ప్రణీతలు హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘శకుని'. ఎన్. శంకర్ దయాల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ సంగీతం అందించారు. తెలుగులో ఈచిత్రం హక్కులను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ సీడీని ఆవిష్కరించి తొలి కాపీని వివి వినాయక్‌కు అందించారు.

ఈ సందర్భంగా వెంకీ, వినాయక్, కోట ఎశ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ...కార్తీ పెర్ఫార్మెన్స్‌ను పొగుడుతూ సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. హీరో కార్తి మాట్లాడుతూ ఏక కాలంలో నా సినిమా రెండు భాషల్లో విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా మొత్తం వినోదాత్మకంగా సాగిపోతుంది. ఫస్ట్ టైమ్ కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లాంటి పెద్ద యాక్టర్లతో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. జివి ప్రకాష్ ట్రెమండస్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.

నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ....కార్తి సినిమాల్లోనే భారీ ఎత్తున 400కు పైగా థియేటర్లలో ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేస్తున్నాము. మా బ్యానర్‌కు ప్రతిష్టను పెంచే విధంగా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

శకుని అంటే దుష్ట ఆలోచనలే అనుకోవద్దు. ఓ సమస్య నుంచి తెలివిగా ఎలా బయటపడాలో అతనికి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో శకుని స్వభావం ఉన్నవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ప్రస్తుతం మధ్యవర్తులు లేకపోతే... ఏ పనీ జరగడం లేదు. లంచం ఇవ్వకపోతే ఫైలు కదలడం లేదు. ఈ వాతావరణంలో ఓ యువకుడు శకునిలా తన పనులను చక్కబెట్టుకొన్నాడు అనేదే 'శకుని'చిత్రం స్టోరీ లైన్.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, రాధిక, నాజర్‌, రోజా, సంతానం తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: సాహితి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, ఛాయాగ్రహణం: పి.జి.ముత్తయ్య, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: అనల్‌ అరసు, డాన్స్‌: ప్రేమ్‌రక్షిత్‌, బాబా భాస్కర్‌, సహ నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌, ఎస్‌.ఆర్‌.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం: ఎన్‌.శంకర్‌ దయాళ్‌.