జూ ఎన్టీఆర్ సేఫ్, ఆందోళన వద్దు

జూ ఎన్టీఆర్ సేఫ్, ఆందోళన వద్దు

‘బాద్ షా' చిత్రం కోసం ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న  యంగ్ టైగన్ జూ ఎన్టీఆర్ గాయపడ్డట్లు వస్తున్న వార్తలపై..... బాద్ షా చిత్రానికి పని చేస్తున్న ప్రముఖ రచయిత కోన వెంకట్ స్పందించారు. జూ ఎన్టీఆర్ ఇంజుర్ కాలేదని, అతను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారని, ఆందోళన వద్దని వెంకట్ స్పష్టం చేశారు.

‘బాద్ షా' చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం ఈ రోజు ఇటలీ వెల్లనుంది. ఇప్పటికే అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ న్యూలుక్‌తో కనిపించనున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. అక్కడే రెండు పాటలు కాజల్,ఎన్టీఆర్ మధ్యన తీయనున్నారు. అలాగే ఎమ్.ఎస్ నారాయణ,వెన్నెల కిషోర్,ఎన్టీఆర్ మధ్యన కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని తీస్తున్నారు. అంతేకాకుండా దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ‘బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.