పరుగులు పెడుతున్న బంగారం ధర

పరుగులు పెడుతున్న బంగారం ధర

బంగారం పరుగులు పెడుతోంది. ఎవరికి అందనంత ఎత్తుకు చేరుతూ.. కిందికి దిగిరానంటోంది. కొంత కాలంగా కొంత నిలకడగా ఉన్న గోల్డ్ రేట్ మళ్లి భారీగా పెరగడంతో ప్రస్తుతం దాని ధర ముప్పై వేలకు దగ్గరలో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే త్వరలోనే పసిడి 30 వేల మార్క్ ను దాటి ఆల్ టైం హైకి చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరకు మళ్లి రెక్కలొచ్చాయి . కొంత కాలంగా నిలకడగా ఉంటున్న గోల్డ్ రేట్ అమాంతం పెరిగిపోతోంది. మార్కెట్లో నెలకొన్న ఒడుదుడుకుల నేపథ్యంలో రెండు , మూడు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధర ప్రస్తుతం ముప్పై వేల మార్క్ కు చేరువలో ఉంది. త్వరలోనే ఆల్ టైమ హైని తాకనుంది.

గురువారం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 29, 960 రూపాయలకు చేరగా 22 క్యారెట్స్ గోల్డ్ 28,100 రూపాయలుగా నమోదైంది. ఇక కిలో వెండి ధర 54,400 పలికింది. మార్కెట్లో ఇదే ట్రెండ్ కొనసాగితే త్వరలోనే పసిడి ముప్పైవేల మార్క్ దాటవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరోవైపు బంగారం రేట్ ఆకాశాన్నంటుతున్నా కొనుగోళ్లపై మాత్రం ఎలాంటి ప్రబావం పడడంలేదు. ఎప్పటిలానే జ్యూవెల్లరి షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతూన్నాయి. అటు వ్యాపారులు తమ డబ్బును గోల్డ్ పై ఇన్ వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో పసిడి ఎవరికందనంతా ఎత్తుకు ఎగబాకుతుంది. ఇక సామాన్యులు ,మధ్యతరగతి ప్రజలు మాత్రం బంగారం పేరు వింటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది.