రేపే ఇస్తున్నామని చెప్పినా మేం నమ్మం.

 రేపే ఇస్తున్నామని చెప్పినా మేం నమ్మం.

తెలంగాణ రాష్ట్రాన్ని రేపే ఇచ్చేస్తున్నామని చిదంబరం చెప్పినా తాము నమ్మబోమని తెలంగాణ ఐకాస కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ అంశంపై త్వరలోనే తేల్చాస్తామని హోంమంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కోదండరామ్ స్పందించారు.

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్లుగా చేస్తున్న తాత్సారం చూస్తుంటే తెలంగాణపై అధికారిక ప్రకటన చేసే వరకూ ఆ పార్టీని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. చిదంబరం వ్యాఖ్యలను చూసి సంబరపడిపోనవసరం లేదని అన్నారు.

జులై నెలలో ఉద్యమ కార్యాచరణపై చర్చించి ఉధృతం చేయబోతున్నట్లు కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చేంత వరకూ ఉద్యమిస్తూనే ఉంటారని చెప్పారు.