పవన్ గ్రీన్ సిగ్నల్..ప్యాన్స్ ఫుల్ హ్యాపీ

పవన్ గ్రీన్ సిగ్నల్..ప్యాన్స్ ఫుల్ హ్యాపీ

హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మించిన 'గబ్బర్‌సింగ్' సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రేంజి హిట్ రావటంతో అభిమానలు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 50 డేస్ ఫంక్షన్ ఘనంగా జరపాలని గణేష్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఉత్సావానికి పవన్ కళ్యాణ్ హాజరవ్వటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మొదట ఈ పంక్షన్ ని లో ప్రొఫైల్ లో వైజాగ్ లో వివి వినాయిక్ ధియోటర్ లో చేద్దామని ప్లాన్ చేసారు. అయితే హరీష్ శంకర్,గణేష్ బాబు కలిసి పట్టుబట్టి పవన్ ని ఒఫ్పించారు. దాంతో ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దాంతో ఈ పంక్షన్ కి గ్రాండ్ గా చేయాలని గణేష్ బాబు నిర్ణయించారు. ఆ పంక్షన్ ఎక్కడ,ఎప్పుడు జరిగేది త్వరలోనే మీడియాకు తెలియచేస్తామన్నారు. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు హాజరు అవుతానని మాట ఇచ్చాడని తెలుస్తోంది.

గణేశ్ తీసిన తొలి రెండు చిత్రాలు సరిగా ఆడకపోవడంతో ఆయనను అపహాస్యం చేసినవాళ్లకు 'గబ్బర్‌సింగ్' రికార్డులే సమాధానం అని హరీష్ శంకర్ చెప్పారు. గబ్బర్ సింగ్ రికార్డు కలెక్షన్స్ తో దూసుకు పోతున్న నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. గతంలో గణేష్ చేసిన తీన్ మార్,ఆంజనేయులు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. దాంతో అంతా గణేష్ ని ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్ అన్నారు. అయితే గబ్బర్ సింగ్ చిత్రం గణేష్ ని ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాతను చేసింది.

అలాగే "పవన్‌కల్యాణ్ లేకపోతే 'గబ్బర్‌సింగ్' లేదు. ఈ సినిమా కొత్త రికార్డులు కొట్టేంత హిట్టు కావడం వెనుక పవన్‌కల్యాణ్ కృషి ఎంతో ఉంది. తన ఆరోగ్యాన్ని పణంగాపెట్టి ఈ సినిమా చేశారు. ఇంత పెద్ద హిట్టొచ్చిందని ఆయన్ను కలిసి కలెక్షన్ల గురించి చెప్పబోతే ఆయన వారించారు. వాటికి ఆయన అతీతుడు. ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్, ఎడిటర్ గౌతంరాజు, ఫైట్‌మాస్టర్లు రామ్-లక్ష్మణ్ పాత్ర కూడా ఉంది అని హరీష్ చెప్పారు.