సంబరాల్లో పవన్ కళ్యాణ్: కేక్ కట్టింగ్

సంబరాల్లో పవన్ కళ్యాణ్: కేక్ కట్టింగ్

‘గబ్బర్ సింగ్' చిత్రం 306 సెంటర్లలో 50 రోజుల వేడుక జరుపుకుని 81 ఏళ్ల తెలుగుసినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో అభిమానులంతా సంబరాలు జరుపుకున్నారు. థియేటర్ల వద్ద కటౌట్స్, పవర్ స్టార్ పోస్టర్లకు పాలాభిషేకం, ర్యాలీలతో దుమ్ము రేపారు.

అయితే సాధారణంగా ఇలాంటి సెలబ్రేషన్స్‌కు దూరంగా  పవన్ కళ్యాణ్ కూడా ఈ సారి సంబరాల్లో పాలు పంచుకున్నారు. తన జీవితంలో ఈచిత్రం బిగ్గెస్ హిట్ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగులో ఉన్న పవన్ సెట్లో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో కోన వెంకట్, దర్శకుడు హరీష్ శంకర్, మెహర్ రమేష్, పూరి జగన్నాథ్ పాల్గొన్నారు.

గబ్బర్ సింగ్ చిత్రం విడుదలైనప్పటి నుంచి పవర్ స్టార్ ఇప్పటి వరకు సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేదు. ఇదే తొలిసారి. నేను ఆకాశం లాంటోన్ని, ఉరుమొచ్చినా..మెరుపొచ్చినా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటా అంటూ సినిమాల్లో డైలాగు కొట్టిన పవన్ రియల్ లైఫ్ లోనూ అదే విధంగా ఉంటుంటారు. ప్లాప్ వస్తే కృంగి పోవడం, హిట్ వస్తే ఎగి గంతేయడం పవన్‌కు చేతకాదు అంటుంటారు ఆయన గురించి తెలిసన వారు.