సమంత అవుట్..అమీ జాక్సన్ ఇన్

సమంత అవుట్..అమీ జాక్సన్ ఇన్

సమంత వరసగా మణిరత్నం,శంకర్ చిత్రాల నుంచి బయిటకు వచ్చి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె శంకర్ సినిమాలోంచి బయిటకు రాగానే ఆ ప్లేస్ లోకి అమీ జాక్సన్ ని తీసుకున్నట్లు సమాచారం. అలా సమంత బయిటకు రావటానికి కారణం స్కిన్ డిసీజ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శంకర్ చిత్రంలో హీరోగా విక్రమ్ హీరోగా చేస్తున్నారు. రెండు పెద్ద దర్శకుల చిత్రాల నుంచి ఆమె బయిటకు రావటం ఆమె అభిమానులను కలవరపరుస్తోంది.


ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం పేరు ‘తేర్దల్'. అంటే తెలుగులో ఎన్నికలు అని అర్థం. విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గత శుక్రవారం షూటింగ్ హంగూ ఆర్బాటం లేకుండా ఆరంభమైంది. సినిమా టైటిల్ ‘తేర్దల్' కాబట్టి, ఇది పొలిటికల్ డ్రామా అని చెప్తున్నారు. ఎన్నికల విధానంపై ఈ చిత్రం సాగుతుందని సమాచారం.

ఆస్కార్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా వ్యవహరిస్తున్నారు. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఏడేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ‘తేర్దల్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు.

అమీ జాక్శన్ విషయానికి వస్తే..‘మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత ‘ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. తెలుగులో కెరీర్ విషయానికి వస్తే...వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఎవడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.