కెరీర్‌లోనే చిన్న చిత్రం!

 కెరీర్‌లోనే చిన్న చిత్రం!

దర్శకుడు కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే తాను ఇప్పటిదాకా తెరకెక్కించిన చిత్రాలన్నింటిలోకెళ్ల ఇదే చిన్న చిత్రమని చెబుతున్నాడు. సాధారణంగా కరణ్ జోహార్ చిత్రాలు మూడు గంటలకుపైనే ఉంటాయి. పెద్ద సినిమాలకు పెట్టింది పేరైన కరణ్ ఇలా చిన్న చిత్రం రూపొందించడం ఇప్పుడు బాలీవుడ్‌లో తాజా వార్త. ఈ చిత్రం గురించి కరణ్ వివరాలను వెల్లడిస్తూ...

‘క్యాంపస్ లైఫ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నిడివి కేవలం 2 గంటలు మాత్రమే. ఈ సినిమా చూడడానికి వచ్చినవారు 135 నిమిషాల నుంచి 140 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు. గతంలో నేను తెరకెక్కించిన చిత్రాల్లా మూడు గంటలు, అంతకంటే ఎక్కువ ఉంటుందనుకొని ఈ చిత్రానికి వస్తే పప్పులో కాలేసినట్లే. ‘కబీ అల్విదా న కహెనా' చిత్రం ఇప్పటిదాకా నా కెరీర్‌లో అతి పెద్ద చిత్రం. దాదాపు 215 నిమిషాల నిడివిగల చిత్రమది. 

ఇక ఇప్పటిదాకా విడుదలైన చిత్రాల్లో ‘మై నేమ్ ఈజ్ ఖాన్' తక్కువ నిడివిగల చిత్రంగా చెప్పుకోవచ్చు. దాదాపు 165 నిమిషాలపాటు సాగుతుంది. మిగతా చిత్రాలన్నీ దాదాపు మూడు గంటలకుపైగా సాగేవే. ‘కబీ ఖుషీ కబీ గమ్' 211 నిమిషాలు, ‘కుచ్ కుచ్ హోతాహై' 185 నిమిషాలపాటు ప్రేక్షకులను అలరించాయి. అయితే మారుతున్న కాలాన్నిబట్టి ప్రేక్షకులు సినిమాల కోసం కేటాయిస్తున్న సమయం కూడా మారుతోంది. మూడు గంటలపాటు సినిమా థియేటర్లో కూర్చునే పరిస్థితి లేదు. 

దీంతో తక్కువ సమయంలోనే వారిని సంతృప్తి పర్చాల్సి వస్తోంది. దీంతో సినిమాల నిడివి తగ్గుతోంది. అయితే నేను నిర్మాతగా తెరకెకి ్కన చిత్రాలన్నీ దాదాపుగా తక్కువ నిడివిగల చిత్రాలే. ఇక నుంచి నేను దర్శకత్వం వహించే చిత్రాలు కూడా అలాగే ఉండేలా జాగ్రత్త పడతాను. ఇక ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రం విషయానికి వస్తే అంతా కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న చిత్రం. ప్రస్తుతానికి ఇంతకు మించి కొత్త విషయాలేవీ వెల్లడించలేన'ని చెప్పారు.