బిజెపిలో అద్వాని మాట కూడా చెల్లడం లేదా?

బిజెపిలో అద్వాని మాట కూడా చెల్లడం లేదా?

కాంగ్రెస్, బిజెపిల మద్య పెద్దగా తేడా లేదని వెల్లడవుతుంది. బిజెపి జాతీయ అద్యక్షుడు నితిన్ గడ్కరిని బిజెపి కోర్ గ్రూప్ సమర్ధించిన తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.బిజెపి అద్యక్షుడు గడ్కరి ఎలాంటి విచారణకు అయినా సిద్దపడతారని బిజెపి నేత రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. దీనితో నైతిక కారణాలతోనైనా గడ్కరి రాజీనామా చేస్తారని భావించినవారికి ఆశాభంగమే ఎదురైంది.విశేషం ఏమిటంటే బిజెపిలో తిరుగు లేని నేతగా దశాబ్దాల తరబడి కొనసాగిన ఎల్.కె. అద్వాని మాటను కూడా కోర్ గ్రూప్ పెద్దగా పట్టింంచుకోకపోవడం. ఆయన దీనిపై ముందుగానే కోర్ గ్రూప్ ఒక అబిప్రాయానికి వచ్చిందని తెలిసి ఆయన సమావేశానికి కూడా రాకపోవడం. ఇది ఒకరకంగా ఆశ్చర్యమే. అద్వాని ఒకప్పుడు హవాల ఆరోపణలు రాగానే ఎమ్.పి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కున్నారు. ఆ తర్వాత దానిని కొట్టవేశాకే ఆయన తిరిగి ఎన్నికలలోకి వచ్చారు.మరి గడ్కరి విషయంలో ఇలా జరగడం అందరికి ఆశ్చర్యం కలిగించే అంశమే.జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా వంటి నేతలు కూడా గడ్కరిని తప్పుకోవాలని భావించినా అది జరగకపోవడం విశేషం.