అయినా అనిశ్చితిపై విస్తారంగా కధనాలు!

అయినా అనిశ్చితిపై విస్తారంగా కధనాలు!

కాంగ్రెస్ పార్టీ అదిష్టానానికి రాష్ట్రానికి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకుంటోందంటూ మళ్లీ కధనాలు వచ్చాయి. ఎఐసిసి అదికార ప్రతినిధి, రాష్ట్ర ఇన్ చార్జీ రేణుకా చౌదరి సి.ఎమ్. కిరణ్ ను ఎందుకు మార్చుతారని వ్యాఖ్యానించినప్పట్టికీ, మంగళవారం పత్రికలలో ముఖ్యమంత్రి కిరణ్ కు సంబందించి పలు వ్యతిరేక వార్తలు వచ్చాయి. సి.ఎమ్. శిబిరంలో ఏదో అనుమానం ఉండబట్టే ఆయన తరపున డిల్లీకి పది మంది ఎమ్మెల్యేలు వచ్చారని, వారు సోనియా వద్ద సి.ఎమ్.ను మార్చవద్దని నినాదాలు చేశారని ఒక పత్రిక రాస్తే, ముఖ్యమంత్రి, పిపిసి అద్యక్షుల వ్యవహరంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని, త్రిశంకు నరకంలో కిరణ్,బొత్సలు ఉన్నారని మరో పత్రిక రాసింది.ఇంకో పత్రిక ఒక రోజు ముందుగానే కిరణ్ ను మార్చవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన నేతలందరికి అప్పాయింట్ మెంట్ ఇచ్చినా కొద్ది నిమిషాలలోనే సోనియా వారందరిని పంపించివేశారని, శశిధర్ రెడ్డితో మాత్రం ఇరవై ఆరు నిమిషాలు మాట్లాడరని కధనాలు వస్తున్నాయి. అంటే ఏదో జరుగుతున్నట్లా? కిరణ్ వర్గం మాత్రం అది తెలంగాణ అభివృద్ది మండలి ఛైర్మన్ నియామకం గురించే అని భావిస్తుండగా అసమ్మతి వర్గం మాత్రం సి.ఎమ్. మార్పే అని ప్రచారం చేస్తోంది.