చంద్రబాబు పాదయాత్రకు మళ్లీ బ్రేక్!

చంద్రబాబు పాదయాత్రకు మళ్లీ బ్రేక్!

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. కోస్తా జిల్లాలలో వరద బారిన పడ్డ ప్రాంతాలలో పర్యటించడానికి గాను ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి కృష్ణా జిల్లా గన్నవరం వెళ్లి , ఆయా జిల్లాలలో పర్యటిస్తారు. దీంతో చంద్రబాబు తన పాదయాత్రను మళ్లీ వాయిదా వేసుకున్నారు.టిడిపి సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు మరణం కారణంగా బ్రేక్ పడ్డ పాదయాత్ర ను ఈరోజు నుంచి ప్రారంభించడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్నారు. అయితే తిరిగి భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఆయన మళ్లీ బ్రేక్ వేసి తిరిగి ఆ ప్రాంతాలకు వెళుతున్నారు.ఇప్పటికే వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు డిల్లీ వెళ్లారని చంద్రబాబు విమర్శించారు. ఈ నేపద్యంలో ఆయన స్వయంగా బయల్దేరి వెళుతున్నారు.