దీపావళి వరకు రాష్ట్రంలో యధాతధ పరిస్థితి!

దీపావళి వరకు రాష్ట్రంలో యధాతధ పరిస్థితి!

ఎఐసిసి స్థాయిలోకాని, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో కాని ఎలాంటి మార్పులైనా దీపావళీ పండగ తర్వాతే చేపట్టాలని పార్టీ అదిష్టానం ఒక అబిప్రాయానికి వచ్చినట్లు కధనాలు వస్తున్నాయి. ఈ నెల తొమ్మిదో తేదీన కాంగ్రెస్ మేధోమదన సదస్సును నిర్వహించనున్నందున ఈలోగానే డిల్లీలో మార్పులు చేయడం సరికాదని పార్టీ నాయకత్వం భావించిందని అంటున్నారు. అలాగే ఆ తర్వాత కొద్ది రోజులకే దీపావళీ పండగ రానున్నందున అప్పటివరకు ఆగితే నష్టం లేదని పార్టీ నాయకులు అబిప్రాయపడ్డారు. ముందుగా ఎఐసిసిలో మార్పులు, రాహుల్ గాందీకి ప్రధాన బాద్యతల అప్పగింత, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సమస్యలపై అదిష్టానం దృష్టి పెట్టవచ్చు. అంటే దీనినిబట్టి మరో పది,పదిహేను రోజులు యధాతధ పరిస్థితి కొనసాగుతుందని అనుకోవచ్చు.