సి.ఎమ్.ను మార్చుతారు-డి.ఎల్.

సి.ఎమ్.ను మార్చుతారు-డి.ఎల్.

ఒకపక్క ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చరని భరోసాగా చెబితే, రాష్ట్ర మంత్రి డి.ఎల్. రవీంద్ర రెడ్డి మాత్రం అదేరోజు ముఖ్యమంత్రి మార్పు ఖాయమని ప్రకటించారు. మరో పది రోజులలో రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నట్లుగా కధనాలు వస్తున్నాయి.రేణుకా చౌదరి తన మీడియా సమావేశంలో మీడియా ఎందుకు కిరణ్ ను మార్చుతారని పదే,పదే రాస్తారు?పదే,పదే ప్రశ్నిస్తారు? ఈ రోజుకు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పిన తీరులో కొంత ఆశ్చర్యం కనిపించింది. ఈ రోజుకు ఆయనే సి.ఎమ్. అంటే రేపటి సంగతి ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. అయితే ఆ తర్వాత ఆమె జాగ్రత్తపడి ముఖ్యమంత్రి కిరణ్ పట్ల అదిష్టానానికి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. దాంతో పరిస్థితి బెటర్ అయింది.అయితే ఆమె ఇలా చెప్పిన సమయంలోనో , కాస్త అటూ,ఇటూగానో స్వయంగా కిరణ్ మంత్రివర్గంలోని అసమ్మతి నేత డి.ఎల్.రవీంద్ర రెడ్డి మళ్లీ సి.ఎమ్.ను మార్చుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తప్పు ఎవరిది?