వరద ప్రాంతాలలో పోటాపోటీ యాత్రలు!

వరద ప్రాంతాలలో పోటాపోటీ యాత్రలు!

భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి,బాధితులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు , వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పోటాపోటీ యాత్రలు చేస్తున్నారు.కిరణ్ ఢిల్లీ టూర్ నుంచి తిరిగి వచ్చి జిల్లాల పర్యటనకు వెళుతుండగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసి కృష్ణా జిల్లాకు వెళ్లారు. అలాగే విజయమ్మ కూడా బయల్దేరి వెళ్లారు.కాగా ముఖ్యమంత్రి డిల్లీ వెళ్లి ర్యాలీలో పాల్గొనడంపై చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ వరదలు వస్తుంటే ముఖ్యమంత్రి డిల్లీలో కూర్చుంటారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.కాగా కిరణ్ డిల్లీలో ఉండి కూడా పరిస్థితిని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వవర్గాలు వాదిస్తున్నాయి.కాగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ జైలులో ఉన్నప్పట్టికీ, ఆ లోటును భర్తీ చేయడానికి విజయమ్మ,షర్మిల ప్రయత్నిస్తున్నారు. షర్మిల అన్న తరపున పాదయాత్ర చేస్తుంటే, విజయమ్మ కొడుకు తరపున జిల్లాలలో పర్యటిస్తున్నారు.