కిరణ్ శిబిరం తప్పు చేసిందా?

కిరణ్ శిబిరం తప్పు చేసిందా?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గం ఢిల్లీకి కొందరు ఎమ్.పిలను పంపి తప్పు చేసిందా?ఇప్పుడు కాంగ్రెస్ లో ఆ చర్చ జరుగుతోంది.కిరణ్ కు మద్దతుగా తెలంగాణ కు చెందిన ఎమ్మెల్యేలు కె.ఎల్.రెడ్డి, కిష్టారెడ్డి , బిక్షమయ్య గౌడ్ తదితరులు డిల్లీలో సోనియాగాందీని, అజాద్ తదితరులను కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణపై తేల్చండి కాని, సి.ఎమ్.ను మార్చకండి అని చెప్పి వచ్చారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వర్గాలలో చర్చకు తెర తీసింది. ఇంతకాలం ఎన్నడూ కిరణ్ ఇలా తనకు మద్దతు కూడగట్టుకుని ఢిల్లీ పంపే ప్రయత్నం చేయలేదని, ఆయనకు కూడా ఏదో సందేహం రాబట్టే కదా ఇలా చేశారని ప్రత్యర్ధి వర్గం ప్రచారం చేస్తోంది.పైగా ఢిల్లీ స్థాయిలో కూడా దీనిపై చర్చకు ఆస్కారం ఏర్పడిందని అంటున్నారు.పైగా కిరణ్ తరపున వెళ్లినవారికే దీనిపై అనుమానం వచ్చి , కొందరు పూర్తిగా రాయబారం అవ్వకుండా వెనుదిరిగారని కధనాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఏది జరిగితే అదే జరుగుతుందిలే అని చెబుతూ వచ్చిన కిరణ్ శిభిరం ఇప్పడు తన తరపున ఎమ్మెల్యేలను పంపి తప్పు చేసిందా?