కాంగ్రెస్ ను వీడనంటున్న కోమటిరెడ్డి!

కాంగ్రెస్ ను వీడనంటున్న కోమటిరెడ్డి!

కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి జానారెడ్డిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ తేవడం తమవల్ల కాదని జానారెడ్డి అనడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రుల దృష్టి అంతా ఎన్నికలపైనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ కూడా అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లడానికి ప్రయత్నించాలని కోమటిరెడ్డి సూచించారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి నాగార్జునసాగర్ నీటిని సాగర్ ఎడమ కాల్వకు వదలాలని విజ్ఞప్తి చేశారు.జానారెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని కోమటిరెడ్డి ఈ విమర్శలు చేశారు. కాగా కాంగ్రెస్ ను వీడే ప్రసక్తిలేదని ఆయన అనడం విశేషం.గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి సోదరులు పార్టీ మారవచ్చని ప్రచారం జరుగుతుండగా దానిని తోసిపుచ్చే రీతిలో ముఖ్యమంత్రిని కలవడం, కాంగ్రెస్ ను వీడనని చెప్పడం విశేషం.