మోహన్ బాబు, బ్రహ్మానందంలపై కేసు నమోదు

మోహన్ బాబు, బ్రహ్మానందంలపై కేసు నమోదు

దేనికైనా రెడి సినిమా వివాదంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రముఖ నటులు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు, అలాగే మరో ప్రముఖ నటుడు బ్రహ్మానందంలతోపాటు దర్శకుడు నాగేశ్వరరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘ నాయకులు ఆందోళన చెస్తున్న నేపద్యంలోకొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఈ మేరకు కేసు నమోదుచేసి విచారణ చేయాలని పోలీసులను కోరింది. అయితే ఇప్పుడు పోలీసులు ఏ విదంగా చేస్తారు? పోలీసులు నటులను కూడా అరెస్టు చేస్తారా?లేక ఈలోగా పైకోర్టుకు వెళ్లి మోహన్ బాబు స్టే తెచ్చుకుంటారా?అన్నది చూడవలసి ఉంది. అయితే బ్రాహ్మణులపై ఎక్కడా అభ్యంతర సన్నివేశాలు లేవని, కావాలని కొందరు ఈ వివాదం సృష్టిస్తున్నారని మోహన్ బాబు, విష్ణు అన్నారు.