కాంగ్రెస్ కు సుబ్రహ్మణ్యస్వామి గండం!

కాంగ్రెస్ కు సుబ్రహ్మణ్యస్వామి గండం!

అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసినా చెల్లుతుందని అనుకుంటారు.అలాగే ఎవరికి తెలియకుండా రహస్యంగానే ఉంటుందనుకుంటారు. కాని ఒక్కసారి అది బయటకు రాగానే అదో పెద్ద సంచలనంగా మారుతుంది.కాంగ్రెస్ పార్టీ ఆదాయపన్ను శాఖ నిబంధనలను ఉల్లంఘించి ఒక వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే కంపెనీకి తొంభై కోట్ల రుణాన్ని ఇచ్చిన వైనం వివాదంగా మారింది.జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఎన్నికల కమిషన్ కు ఒక ఫిర్యాదు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు.అసలే అసోసియేటెడ్ జర్నల్స్ ట్రస్టును సోనియాగాందీ , రాహుల్ కొనుగోలు చేసిన వైనంపై పదహారు వందల కోట్ల రూపాయల విలువైన ట్రస్టును కేవలం ఏభై లక్షలకే కొనుగోలు చేశారని అవినీతి వ్యతిరేక పోరాట యోదుడు కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో సతమతమవుతుంటే, పులిమీద పుట్రలా సుబ్రహ్మణ్య స్వామి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం విశేషం. అయితే అదికారం ఉంది కనుక ప్రస్తుతానికి ఏదో విధంగా బయటపడవచ్చేమో. తాము ఒక ట్రస్టుకే నిధులు ఇచ్చామని కాంగ్రెస్ వివరణ ఇస్తుందా?మరే వివరణ ఇస్తుందా అన్నది చూడాలి.