టిడిపినే కులం మీద ఆధారపడి నడుస్తోందా?

టిడిపినే కులం మీద ఆధారపడి నడుస్తోందా?

తెలుగుదేశం నుంచి పార్టీ మారి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో ప్రవేశించిన సీనియర్ నేత కృష్ణారావు ఇప్పుడు టిడిపిపై విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్.టి.రామారావు హుందాగా నడిపితే, చంద్రబాబు అందుఉ విరుద్దంగా నడుపుతున్నారని ఆయన అబిప్రాయపడ్డారు. టిడిపిని కుల పార్టీగా, కుటుంబ పార్టీగా తయారు చేశారని కృష్ణబాబు ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోతే, టిడిపి 75శాతం అయిపోయిందని ఆయన అంచనా వేశారు. కాగా జగన్ డైనమిక్ బోయ్ అని , ఆయనను ముఖ్యమంత్రిని చేయడమే తన ధ్యేయమని, జగన్ జైలు నుంచి బయటకు రాడని కొందరు ప్రచారం చేస్తున్నారని, అలాగైతే సోనియా అల్లుడు రాబర్ట్ వద్రా కూడా జైలుకు వెళ్లవలసి ఉంటుందని అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు 200 స్థానాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అయితే జగన్ తనకేమీ ప్రత్యేక హామీ ఇవ్వలేదని అంటున్నారు.కృష్ణబాబు ఇప్పుడు టిడిపిని కుల పార్టీ అని, కుటుంబ పార్టీ అంటున్నారు కాని, ఒక బిజెపి తప్ప ఇప్పుడు అన్ని పార్టీలు ఏదో ఒక కుటుంబం మీద, కులం మీద ఆధారపడి నడుస్తున్నాయని చెప్పాలి.