జైల్లో సంజయ్ దత్ ఇంకా ఎన్నాల్లు గడపాలి?

జైల్లో సంజయ్ దత్ ఇంకా ఎన్నాల్లు గడపాలి?

ముంబై వరుస బాంబు పేలుళ్ళ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో తనకు తీరని బాధ కలిగినదని బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అన్నారు. ఈ తీర్పుతో తన గుండె పగిలిందని, భావోద్వేగమైన క్షోభకు గురయ్యానని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుపై చట్టపరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తానని చెప్పారు.

అక్రమ ఆయుధాల కేసులో మరో మూడేళ్లన్నరేళ్ళ పాటు శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. నేను గత 20 ఏళ్లుగా అవస్థ పడుతున్నాను. నాతోపాటు, నా ముగ్గురు పిల్లలు, భార్య, కుటుంబం శిక్ష అనుభవించాల్సి ఉండటంతో నా గుండె పగిలింది. నేను ఎప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవించాను.18 నెలలు జైలులో గడిపాను. ఇంకా నేను బాధపడాలని వారు కోరుకుంటే నేనింకా శక్తిమంతుడిని కావాల్సి ఉంది.  కన్నీళ్లతో ఇకముందు కూడా గౌరవిస్తాను అని సంజయ్‌ దత్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, సుప్రీంకోర్టు తీర్పును సంజయ్‌దత్ యధాతథంగా అంగీకరించారని ఆయన తరపు న్యాయవాది సతీష్ మానెషిండే తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుపై చట్టపరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తామని చెప్పారు. ప్రముఖ క్రిమినల్ లాయర్ మజీద్ మెమన్ మాట్లాడుతూ శిక్ష నుంచి ఊరట పొందటానికి సంజయ్‌కి చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ కి మరియు రాజకీయ రంగానికి చెన్దిన అనేక ప్ర్రముఖులు సంజయ్ దత్ కు తమ సానుభూతిని మరియు న్యాయ వ్యవస్థ పై తమ ప్రఘాడ విశ్వాసాన్ని తెలియపరిచారు.