Review on Telugu cinema reviews Back Bench Student

Review on Telugu cinema reviews Back Bench Student

రివ్యూ లు చదివి సినిమాలు చూస్తున్నారా ?? అయితే మీరు రివ్యూ ల మీద నా రివ్యూ చదవాల్సిందే ...!!!


సినిమాల కి రివ్యూ లు రాయటం మన తెలుగు సినిమా ల కి కొత్తేం కాదు, మనకు ఈ కల్చర్ తెలుగు సినిమా పుట్టినప్పటినుంచి ఉంది, అయితే మొదట్లో రివ్యూ లు పాత్రికేయ రంగం లో అనుభవం ఉన్న వాళ్ళు, సినిమా రంగం మీద అవగాహన ఉండే వాళ్ళు, సాహిత్యం లో అవగాహన ఉండే వాళ్ళు సినిమా చూసి విశ్లేషించి తరువాత ప్రచురించే వాళ్ళు. అవికోడ కొన్ని ప్రత్యేకమైన , గుర్తింపు ఉన్న పత్రికలలో మాత్రమె ప్రచురితమయ్యెవి. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇంటర్నెట్ అందు బాటులోకి వచ్చిన తర్వాత సినిమా ల కి రివ్యూ లు రాసే వెబ్సైటు లు ఎన్ని ఉన్నాయో లెక్క లేదు ఇవి సుమారుగా లక్షలలో ఉన్నాయ్. వీటిలో ఏవి నమ్మదగినవి ? ప్రేక్షకుడు వీటిలో ఏ వెబ్సైటు లో రివ్యూ చదివి సినిమా కి వెళ్ళాలి ? ఈ రివ్యూ లు రాసే వాళ్ళ కనీస అర్హతలు ఏంటి ? వీళ్ళకి సినిమాటోగ్రఫీ అంటే తెలుసా? ఎడిటింగ్ అంటే తెలుసా? దర్సకత్వం అంటే తెలుసా ? జేబులు ఐదు వేల రూపాయిలు ఉన్న ఎవడైనా ఒక వెబ్సైటు పెట్టు కోవచ్చు రివ్యూ లు రాయొచ్చు , కాని ఇలాంటి రివ్యూ ల వాళ్ళ నిర్మాత ల తల రాతలు మారిపోతున్నాయన్న విషయం వీళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా ? సినిమా చూసొచ్చి మిగతా వెబ్సైటు ల కంటే వీళ్ళే ముందు రాయాలనే తాపత్రయం లో థియేటర్ మెట్ల మీదే కూచుని రివ్యూ రాసి అప్ లోడ్ చేసే వాళ్ళని నేను చాల మందిని చూసాను.


మన తెలుగు వాళ్లకి సినిమా కి ప్రత్యేక మైన అనుబంధం ఉంది, ప్రతి తెలుగు వాడు సినిమా ని సినిమా వాళ్ళని తన కుటుంబం లో ఒక భాగం గ చూసు కుంటాడు, దీనిని అలుసుగా తీసుకొని నటీ నటుల మీద లేని పోనీ గాస్సిప్స్, కొత్త కొత్త కథలు సృష్టించటం, వీళ్ళు రాసే స్టొరీ ల కి మసాల హెడ్డింగ్స్ పెట్టి కేవలం వాళ్ళ వెబ్సైటు లో క్లిక్స్ కోసం వీళ్ళు చేసే పనులు నా దృష్టిలో వ్యభిచారం కంటే దారుణమైన విషయం. వ్యభిచారులు డబ్బు కోసం కేవలం వళ్ళు అమ్ముకుంటారు మరి వీళ్ళు వెబ్సైటు లో క్లిక్స్ కోసం, TRP రేటింగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తారు. సినిమా వాళ్లకి కూడా కుటుంభాలు ఉంటాయని, ఇవి చదివితే వాళ్ళు బాధ పడతారని కొంచెం కోడ ఆలోచించారు. వీళ్ళ మీద ఎవరికైనా కోపం వచ్చి ఎదిరిస్తే వాళ్ళ జీవితం సర్వనాసనం అయ్యే వరకు వదిలి పెట్టారు. అందుకే వాళ్ళు ఏమి రాసిన బాధ కలిగిన ఎవ్వరు వీళ్ళ జోలికి వెళ్లారు.

అయితే ఇప్పుడు మనం అసలు విషయం కి వెళ్దాం, ఇప్పుడు ఇవన్ని ఎందుకు చెపుతున్న అంటే ఈ మధ్య కాలం లో కొన్ని వెబ్సైటు ల లో వచ్చే రివ్యూ లు చదివాక నాకు నా అనుభవాలు అందరితో పంచుకోవాలని అనిపించింది.
అసలు ఈ వెబ్సైటు ల వాళ్ళు రివ్యూ లు రాసేందుకు కొలమానాలేంటి? చెత్త సినిమా కి 4/5 ఎందుకు ఉంటున్నాయ్ బాగున్న సినిమా ని కూడా ఎందుకు ఏకి పారేస్తున్నారు, నిజానికి వెనకాల ఎం జరుగుతుంది?
గత 2-3 సంవత్సరాలుగా కొన్ని వెబ్సైటు ల లో వచ్చే రివ్యూ లు చుస్తే ఏ పెద్ద సినిమా కి చుసిన ఆ సినిమా ఎంత చెత్త గ ఉన్న కనీసం 3/5 ఇస్తారు ఎందుకు? పెద్ద నిర్మాతలంటే భయమా ? లేక వెనకాల ఇంకేమైనా జరుగుతున్నాయా? కొన్ని చిన్న సినిమా లని అసలు పట్టించుకోరు రివ్యూ లు రాయరు కోడ , కాని కొన్నింటికి రాస్తారు అన్ని బాగుంటే మంచిగా రాస్తారు, కాని కొందఱు చిన్న నిర్మాతలు వీళ్ళని సంతృప్తి పరచటం లో ఫెయిల్ అవుతారు అలాంటి వాళ్ళు ఇంకా వీళ్ళ చేతిలో బలి పసువులవుతారు. అందుకే ఈ మధ్య కాలం చిన్న పెద్ద అని లేకుండా ప్రతి నిర్మాత ఈ వెబ్సైటు ల లో కూడా పబ్లిసిటీ కి కొంత బడ్జెట్ పక్కన పెట్టుకోవాల్సోస్తుంది. కాని ఇన్ని వేల వెబ్సైటు ల లో ఎంత మంది కి అందించగలరు? అలా ఎవరికైనా మిస్ అయితే మల్లి విషయం మొదటికొస్తుంది. ఆ సదరు సినిమా ని ఎకి పారేస్తారు. ఆ రివ్యూ చదివిన స్కూల్ పిల్లాడికి కోడ ఆ రివ్యూ ఏ ఉద్దేశం తో రాసారో అర్థమవుతుంది. దీనికి ఈ వారం రిలీజ్ అయిన ఒక సినిమా ని ఉదాహరణ గ తీసుకుందాం.

ఈ శుక్రవారం మధుర శ్రీధర్ దర్సకత్వం లో వచ్చిన ' బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ' అనే సినిమా రిలీజ్ అయ్యింది. సదరు డైరెక్టర్ ఇంతక ముందు తీసిన 'స్నేహగీతం' అనే సినిమా ని నేను చూడటం జరిగింది ఎంతో సెన్సిబుల్ గ, యువత కి సందేసాత్మకం గ ఉన్న ఆ సినిమా నాకు నచ్చటం వల్ల, ఈ 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' ట్రైలర్ లు ప్రోమో లు చూడటం వాళ్ళ నాకు ఈ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉండింది. నేను రివ్యూ లు చదివి సినిమా లు చూడను కాని అన్ని రివ్యూ లు చదువుతాను. అయితే ఈ సినిమా రివ్యూ లు నాకు చాల ఆశ్చరానికి గురి చెసాయ్. కొన్ని వెబ్సైటు ల లో ఏమో సినిమా అద్భుతాన్ గ ఉంది అని రాసారు, కొన్నింటిలో ఏమో సినిమా చెత్త గ ఉంది అని రాసారు. ఇదేంటి ఇంత తేడా అని ఈ శనివారం మొత్తానికి సినిమా కి వెళ్ళాను చుస్తే థియేటర్ ఫుల్ గ ఉంది, ఆ రివ్యూ లు చదివిన తర్వాత కూడా థియేటర్ లో ఇంత మంది ఉండటం నాకు ఆశ్చర్యం వేసింది. సరే సినిమా చుసిన తర్వాత నాకు మన తెలుగు వాళ్ళు ఎక్కువ గ ఫాలో అయ్యే 'బోకు ఆంధ్ర ' ( నాకు వెబ్సైటు ని ఇలా పిలవటమే ఇష్టం)వెబ్సైటు లో రివ్యూ చూసి ఆ రివ్యూ కి రివ్యూ రాయాలని అనిపించింది ఆ రివ్యూ లో ఉన్న విషయాలు, సినిమా చుసిన తర్వాత నా అనుభావాలు ఇక్కడ చెప్తాను.
బోకు రివ్యూ : (సాంకేతిక వర్గం పనితీరు గురించి ) : ఎవరు ఆకట్టు కోలేదు, డైరెక్టర్ దే బాధ్యత, డైలాగ్స్ బాలేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెత్త,
వీడి రివ్యూ కి నా రివ్యూ : కెమెరా వర్క్ నాకు బాగా నచ్చింది, ఈ మధ్య కాలం లో వస్తున్న రణ గోన సౌండ్స్ మధ్య లో మూడు మెలోడీ పాటలు చాల బాగున్నాయ్, తలలు నరుక్కోవతాలు, హీరో వీరోచిత విన్యాసాలు, హీరోయిన్ అంగాంగ ప్రదర్శనలు ఎక్కడ లేవు. సినిమా చాల నీట్ గ ఎక్కడ వల్గారిటీ కి తావులేకుండా ఉంది దానితో పాటు యూత్ కి సందేశం ఇవ్వాలని ప్రయత్నించిన దర్శకుడి ని ఖచ్చితంగా అభినందించాల్సిందే.

బోకు రివ్యూ (కళా కారుల పని తీరు ) :
మహాత్ కి హీరో ఫీచర్ లు లేవు

నా రివ్యూ : హీరో అంటే వీడి ద్రుష్టి లో ఎవడైనా బాబు కొడుకో మనవడో అయ్యున్దాలేమో ..!!! మహాత్ చాల బాగా చేసాడు మన పక్కింటి అబ్బాయిల ఉంటాడు బోకు గాడు చెప్పినట్టు హీరో ఫీచర్స్ లేవు కేవలం ఆ సినిమా లో పాత్రకి కావాల్సిన ఫీచర్స్ మాత్రమె ఉన్నాయ్. మహాత్ కి హీరో ఫీచర్స్ లేకపోతే తమిళ్ లో పెద్ద పెద్ద డైరెక్టర్ లు ఎందుకు వాళ్ళ సినిమా లలో తీసుకున్నారో మరి? ఈ బోకుఆంధ్ర గాడు వాళ్ళ కంటే పెద్ద డైరెక్టర్ మరి ...!!!

మొత్తంగా రివ్యూ చదివిన తర్వాత ఈ వెబ్సైటు వాడు ఈ సినిమా ని బాగా టార్గెట్ చేసి, ఏదో పెట్టుకొని రాసినట్టే నాకు అనిపించింది, అలా అని ఈ సినిమా ని ఆహ ఓహో అని నేను చెప్పటం లేదు గత కొద్ది సంవత్సరాలుగు కుటుంబం మొత్తం తో సినిమా కెళ్ళి తర్వాత ఎందుకు పిల్లల్ని తీసుకొచ్చామ ఎందుకు బార్యని తీసుకోచామ అని బాధ పడంది ఈ సినిమా లో మాత్రమె.

రివ్యూ లు చదివి సినిమా ల కి వెళ్ళే వాళ్లకి ఒకటే విన్నపం, దయ చేసి ఇలాంటి రివ్యూ లు చదివి వాళ్ళ అభిప్రాయాన్ని మీ అభి ప్రాయంగా మార్చుకోకండి, వాళ్లకి నిజంగా అంత అవగాహన ఉంటె వాళ్ళే గొప్ప డైరెక్టర్ లు అయిపొయ్యే వాళ్ళు ఇలా క్లిక్ ల కోసం వెబ్సైటు లో హిట్ల కోసం మనసాక్షిని అమ్ముకొరు.

చివరగా నా గురించి : ఇంతక ముందు దాదాపు అన్ని తెలుగు టీవీ చానల్స్ లో పని చేసి ప్రస్తుతం జర్నలిసం లో విలువలు లేవు కోవలం మనసాక్షి ని అమ్ముకోవటమే అని తెలుసు కొని ప్రస్తుతానికి వాటికి దూరంగా అమెరికా లో బ్రతుకుతూ ఎప్పటికైనా మీడియా లో మార్పు వస్తుతుందని వెఱ్రి ఆశ తో బతుకుతున్న ఒక సగటు తెలుగు జీవి .