still remembering my mother every day morning with tears in eyes

still remembering my mother every day morning with tears in eyes

ఎమిటండీ ములక్కాడ పేరు పెట్టి ములక్కాడ కబుర్లు చెపుతారు అనుకుంటున్నారా? ఏమి చేస్తాం చెప్పండి కొంచెం విషయం ఉన్న కబుర్లు చెప్పడానికి మాకు తీరిక ఉన్న వినే మీకు తీరిక లేదు కదా. ఇదేమిటి ఇలా అన్నారు అని మల్లి ఎక్కువగా ఆలోచించ కండి. బాగా ఆలోచిస్తే తెలిసే విషయం ఏమిటంటే మనం ఎన్నో విషయాల మిద సతమత మవుథూ ఉంటాము మన దయనందిన జీవితం లో. అది చాలక మేము కుడా మీకు అవే తలనొప్పి తెచే కబుర్లు చెపితే మీరు మా మాటలు వింటారా? 

ఏమిటి విషయం ఏమి లేకుండానే అనుకుంటున్నారా? 

ఉదయాన్నే నిద్ర లెస్తూనె ఈరోజు ఏవిషయం మీద వ్యాసం వ్రాయాలి అనుకుంటుంటే మా పిల్లలు నిద్ర లేచి స్కూల్ కి తాయారు అవుతున్నారు. నేను చూసి ఒకసారి ఆలోచించాను, ఎంతమంది పిల్లలు రోజు పొద్దున్నే తల్లి తండ్రులు నిద్ర లేపకుండా లేచి తమ పనులు చేసుకుంటున్నారు, తాయారు అయి ఎవెరూ చెప్పకనే తెమిలి పాటశాల కు వెళ్తున్నారు వగైరా... మనం సాధారణం గా ఇవన్ని బాగా పట్టించుకున్నట్టు గా ఉండము, ఆ ఏముందిలే, పెద్దయ్యాకా వల్లే  నేర్చుకుంటారు లే అనుకుంటూ రోజులు గడిపేస్తున్నాము. వాళ్ళు మాత్రమే కాదు ఎక్కడో వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు చేసుకునే భార్య భర్తలు తప్ప మిగిలిన వారు అన్దరూ ఇలాగే ఉంటారు. ఇంటిలో ఒక ఇల్లాలు బాగా భాద్యత తీసుకుని ఈ పనులు chestuu ఉంటె మిగిలినవారు ఏమి చేస్తున్నారు? 

అప్పుడు మల్లి నా ఆలోచనలు నా చిన్నప్పటి రోజులలోకి వెళ్ళాయి. మాది చిన్న ఇల్లు, అమ్మ నాన్న మేము ఇద్దరు పిల్లలము. మా అమ్మ ఉదయాన్నే లేచి మేము నిద్ర లేచే సమయానికి అన్ని తయారు చేసి మమ్మల్ని లేపి మేము తయారు అయ్యాక స్కూల్ కి పంపేది. మమ్మల్ని ఒక వయసు వచ్చే వరకు ఏ పని చేయ్యనిచేది కాదు. కాని, ఒక పది పన్నెండు ఏళ్ళు వచేసరికి చిన్న చిన్న పన్నులు ఇంటిలో బయట కుడా చెప్పి నేర్పించే వారు. పనులే కాదు, బాధ్యత, డబ్బు విలువ, ఎలా జాగ్రతగా ఉండాలి ఒకటేమిటి అన్ని. పెద్ద వాళ్ళని ఎలా గౌరవించలొ ప్రతిది చెప్పేవారు. 

ఈరోజు నాకు అడుగడుగునా ప్రతీ చోట అమ్మ బాగా గుర్తుకు వస్తుంది. అప్పుడు ఎలా ఆ భావాన్ని అమ్మకి చెప్పాలో తెలిసేది కాదు. కళ్ళమ్మట నీళ్ళతో అమ్మా ఏమి ఇచి నీ ఋణం తీర్చుకోగలం   అనిపిస్తుంది. కాని ఇప్పటి పిల్లలలో మనం చెప్పిన మాట వినేటంత తీరిక ఓపిక ఒద్దిక ఇవి ఏమైనా ఉన్నాయా అనిపిస్తుంది. నేను మా ఇంటిలోనే కాదు చాలా మంది ఇళ్ళల్లో చుస్తూనె ఉంటాను ఈ రోజున ఏ ఒక పిల్ల లేదా పిల్లాడు తల్లి తండ్రులకు గురవం మాట వదిలేస్తే నికేమి తెలుసు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచు వచ్చింది ఈ తరం పిల్లలకి. ఏమిటి ఈ నిర్లక్ష్యం? ఎవ్వరి పట్ల గౌరవం బాధ్యతా, వినయం ఇవేమీ లేవు సరి కదా కనీసం వాటిలో చాలా పదాలకి అర్ధం కుడా తెలియదు. ఇది పట్టించుకోవలిసిన వారి తల్లి తండ్రులకి కుడా సమయం లేదు. సమయం ఉన్నా ఎలా వారికి అర్ధం అయ్యేలా చెప్పాలో కూడా తెలియదు. దీనికి మార్గం లేదా? ఈరోజు పిల్లలు ఏమి చదువుతున్నారు? ఈ సినిమాలు ఏ ఏ కార్యక్రమాలు చూస్తున్నారు? అన్నింటిలో చంపుకోవదాలు, బలాత్కారాలు, ఎదిరించాదాలు, కక్ష సాధింపులు, తిట్టుకోవడాలు, కోపం వస్తే ఫైటింగ్ చేసి ఎదుటివారిని ఒదించడాలు ఏమిటిది...
 వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు? ఏది చూస్తారో అదే చేస్తారు కదా. 

దీనికి మన తరపు నుంచి ఏమి చెయ్యగలమో మీరు అలోచించి సలహాలు ఇవ్వగలరా? ఒక సామాన్య పాతకుడిగా అలోచించి నేను ఈ వ్యాసం ఇలా వ్రాసాను. స్పందన వస్తే నేను ఒక రకం గా విజయం సాధించినట్టే. తప్ప కుండా స్పందిస్తారు కదూ...