అమెరికాలో కలెక్షన్స్ అదుర్స్!

అమెరికాలో కలెక్షన్స్ అదుర్స్!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన "బాద్ షా" సినిమా కలెక్షన్స్ అదుర్స్ అనిపించుకుంటున్నాయి. ఈ చిత్రం అమెరికాలో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలో బాద్ షా చిత్రం కలెక్షన్లు 4 రోజుల లోపు 1 మిలియన్ మార్కును దాటి సరికొత్త రికార్డు సాధించింది. 

ట్రేడ్ వర్గాల ఆధారంగా అందిన సమాచారం ప్రకారం అమెరికాలో బాద్ షా కలెక్షన్స్ అదుర్స్ అని సినీ యూనిట్ స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంలోనూ బాద్ షా కలెక్షన్ల పంట పండిస్తున్నాడు. 

బాద్ షాకు వందశాతం ఎంటర్‌టైన్‌మెంట్ టాక్ రావడంతో రాష్ట్రంలో విడుదలైన తొలి మూడు రోజుల్లో రూ. 16.05 కోట్ల షేర్ దక్కినట్లు సమాచారం. బాద్ షా తాకిడికి ఉగాదికి విడుదల కావాల్సిన గ్రీకు వీరుడు, షాడో చిత్రాలు వాయిదా పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా, బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మించారు. తమన్ సంగీతం సమకూర్చారు.