రాజీనామా చేస్తా... సబితా

రాజీనామా చేస్తా... సబితా

జగన్ ఆస్తుల కేసు సీబీఐ ఛార్జిషీటులో ఏ4 నిందితురాలిగా పేర్కొన్న హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన పదవికి రాజీనామా చేయవద్దని ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు చెప్పినప్పటికీ తాను మాత్రం మంత్రి పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు. 

న్యాయం, ధర్మం తనవైపే ఉన్నాయనీ, తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. కాగా సబితా ఇంద్రారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. అయితే, మంత్రి పదవికి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు.