Justify what king of history that schools teach

Justify what king of history that schools teach

చరిత్రలోని మంచి మాత్రమే రాయాలంటే మనవాళ్లు పడ్డ కష్టాలూ, చేసిన ప్రాణత్యాగాలు, మోసాలకి గురయిన ఎందరి అభాగ్యుల జీవితాలు ఇవన్నీ వొదిలేస్తే యింక చరిత్ర ఎందుకు, యే చందమామ కథల్లోని విక్రమార్కుడి గురించో, యే అందమైన వరూధినీ ప్రవరాఖ్యుడిలాంటి కావ్యాలో చదువుకుంటే సరిపోతుంది కదా.మన గురించి గర్వంగా చెప్పుకోడానికి మనకు తగిన నిజమైన వారసత్వమే లేనంత పేద దేశమా? మనమెవరమో, మన నిజమైన చారిత్రక నేపథ్యమెటువంటిదో మన పూర్వీ కులు మన కోసం యేం పాటుపడ్డారో మన వెనకటి తరాలు తమ భవిష్యత్ తరాల కోసం యే యే పోరాటాలూ, త్యాగాలు చేశారో, మన నిజమైన జాతీయ సంపద పూర్వాపరాలూ వీటిమీద యే దేశానికైతే సమగ్రమైన విశ్వసనీయతా, సమచారమూ, అధికారికతా వుంటేనే కదా దానికి అస్థిత్వమూ, భవిష్యత్ తరాలకి ఒక నిజమైన పునాది వేసుకున్నట్టుంటుంది. గతం మరచిన యే జాతికైనా/దేశనికైనా భవిష్యత్ ఎక్కడిది?

మా ప్రభువులవారు అసమాన పరాక్రమవంతుడు, అపర మన్మథుడు అని రాసేవాటిల్లోనే చాలావరకు ఈ ప్రభువుల గుణగణాలు బట్టబయలవుతాయి., అదేకాక ప్రభువులు తమకు తాముగా రాయించుకున్నవాటిల్లో అతిశయోక్తులుంటాయేమో కాని అబద్దాలుండటం చాలా అరుదు. అయితే సాధారణంగా ఆయా కాలానికి కొన్నిసార్లు విదేశీయులు, కవులు రాసిపెట్టిన దాంట్లోవి కూడా ఉపయుక్తంగా వుంటాయి. మొఘల్ చక్రవర్తుల చరిత్రంతా పార్శీ భాషలో రాయించుకున్నారు. వాటిల్లో ఎన్నో మన దేశం ఎల్లలు దాటిపోయాయు. మిగిలినవి National Archives, Govt of India లో భధ్రంగా దాచి పెట్టి పర్మనెంటుగా సీలు వేశారు. ఎంప్పుడో 1820 AD లో నే కొందరు విదేశీయులు ఈ పార్శీ గ్రంథాల్ని ఇంగ్లీషు చేశారు. వాటిల్లో కొన్ని గూగిల్ లైబ్రరీ లో , ఆర్కివ్స్.ఆర్గ్ లో పెట్టారు. పార్శీ వచ్చినవాళ్లూ వెరిఫై చేసుకోవచ్చు. యిక చివరగా , నేను రాసిన అక్బరుపై చివరి బ్లాగులో ఆ టాపిక్ ని క్లోజ్ చేస్తున్నాను. కానీ నిజానికది అక్బర్ చరిత్రకు ముక్తాయుంపు కాదు. మనవాళ్లు 'మొఘల్-ఏ-ఆజం ' సినిమా తీసి చరిత్రకు ఎంత అన్యాయం చేశారో తెలీని అజ్ఙానంలో వుండి కూడా ఆ సినిమాని కలర్స్ లో మళ్లీ తీసి మన పైకి వొదిలితే మనం వాళ్లకి కోట్లు ఆర్జించి పెట్టాం. అంతేకాని చరిత్రలో అక్బరు కుమారుల్లో సలీం ఎన్నో వాడో, అసలు వున్నాడో లేదో తెలియకుండా చరిత్రని నమ్మాం. ఆయన కుమారుల్లో పరమ శాడిస్టు అయిన జహంగీరే ఈ సలీం అన్న పచ్చి నిజం ఎంత మందికి తెలుసు. ఆయనకో ప్రేమ కథని అల్లి అమరప్రేమికుణ్ని చేశాం. ఆ పచ్చి తాగునోతు దేశాన్ని పట్టించుకోకుండా తనకు ఎదురుతిరిగే వాళ్లని(తన వాళ్లయినా) తన సమక్షంలోనే కనుగ్రుడ్లను పెరికించి వేస్తూ యింకా నానారకాల వికృత చేష్టల్తో ఆనందించేవాడు. పరిపాలనని గాలికొదిలేసి విశృంఖల శృంగారంలో, మద్యపానల్లో మునిగితేలేవాడు. ఇలాంటివాడి గురించా మనం కొటేషన్లు రాసుకుంటాం సలీం-అనార్కలీ అనీ. అక్బర్ భార్యల్లో Sultana Begum ఎవరో కాదు. 13యేళ్లప్పుడు తన తండ్రి చనిపోతే రాజ్యం సంక్షోభంలోవుంటే తన తండ్రి కుడిభుజమైన Bairam Khan రాజ్యభారాన్ని భుజానికెత్తుకుని పాలబుగ్గల పసివాడైన అక్బర్ని సింహాసనంపై కూచోబెట్టి ఉప్పుతిన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తే అక్బరేం చేశాడు? చరిత్రకందని మిష్టరీ గా Bairam Khan ని ఎవరో దుండగుల చేతుల్లో హతుడైన వెంటనే మాతృసమానురాలైన తన 'బాబా ' అని పిలుచుకునే Bairam Khan భార్యని నిఖా చేసుకుని తన జనానాలో కి లాగాడు. (ఒకసారి ఛత్రపతి శివాజీ మొఘలుల కోటల్లోనొకదాన్ని వశపరచుకున్నాక అంతఃపుర కాంతనొకరిని తన భటుడొకడు శివాజీ సమక్షంలో నిలబెట్టి 'ఈ ప్రసాదం ప్రభువులవారికి ' అని అంటే శివాజీ మండిపడి ఇంకొకసారి ఇలా యే స్త్రీనైనా బందీగా పట్టుకొస్తే నరికిపారేస్తానన్నాడు.) ఇలాంటి విచక్షణని, న్యాయాన్ని యే మొఘల్ చక్రవర్తి పాటించాడో చరిత్ర పుటలు తిరగేయండి.