Taj Mahal Just dont have only Mumtaz Samad Samadi, who else is there

Taj Mahal Just dont have only Mumtaz Samad Samadi, who else is there

ముంతాజ్ కోసమే తాజమహల్ కడితే ఒక్కదాని సమాదె అక్కడ వుండాలి ..అక్కడ పనిమనిషి సమాది కూడా ఎందుకు వుంది ..?

షాజహాన్ లోని గొప్ప ప్రేమికుడి గురించి ఒకసారి చూద్దాం.షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్ కాదు. ముంతాజ్-ఉల్-జామాని. ఆమె అసలు పేరు అంజుమంద్ బాను బేగం. ముంతాజ్ అన్న పేరును విరిచేసి అందులోని 'తాజ్' ముక్కకు 'మహల్' ను తగిలించటం ఇస్లామిక్ సంప్రదాయం కాదు. సమాధి మందిరాన్ని 'మహల్' ను అని పిలవటం ప్రపంచంలోని ఏ మ ుస్లిం సమాజంలోనూ లేదు. (అదీగాక - తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించినట్టు గాని, ముంతాజ్ ను అక్కడ ఖననం చేసినట్టుగానీ, అనంతర కాలంలో షాజహాన్ ను అక్కడ పూడ్చినందుకు దాఖలాగా గానీ తాజ్ మహల్ వద్ద ఒక శాసనమూ లేదు. ఒక శిలాఫలకమూ లేదు. ఎందుకని? అది కబ్జా చేసిన పురాతన రాజభవనం అన్న నిజం ప్రజలందరికీ తెలుసు కనకేనా దాన్ని తన ఘనకార్యంగా చిత్రించుకునేందుకు షాజహాన్ సాహసించలేకపోయాడు?) తన రాజకీయ తంత్రంలో భాగంగా కుర్ర యువరాజు ఖుర్రం (అతడే తరవాత షాజహాన్) కు తన మేనకోడలు ముంతాజ్ ను నూర్జహాన్ (సవతి తల్లి ఆశ్రమంలో ఉన్న నూర్జహాన్ ను రాణిగా చేపట్టిన జహంగీర్ ) కట్టబెట్టింది. ఆమె రాచకన్య కాదు కనుక నిశ్చితార్థం చేసుకున్న ఐదేళ్లకు గానీ షాజహాన్ ఆమెను పెళ్ళాడలేదు. ఈలోపు ఓ పారసీక రాకుమారిని వివాహం చేసుకున్నాడు. చక్రవర్తి కావడానికి ముందు గానీ తరవాతగానీ ముంతాజ్ మీద ( గ్యాప్ లేకుండా పధ్నాలుగు కాన్పులు చేయించడం మినహా ) వల్లమాలిన ప్రేమ కనబరచిన సందర్భాన్ని ఆస్థాన భజనగాళ్లు ఎక్కడా రాయలేదు. చనిపోయాక (14వ నెంబరు బిడ్డను కనే ప్రయత్నంలో పురుటిలోనే ముంతాజ్ బుహాన్ పూర్ లో మరణించినప్పుడు ఆమెను ఆ ఊళ్లోనే పాతిపెట్టారు ) తాజ్ మహల్ సముదాయంలో ఖననం చేసి గొప్ప సమాధి సౌధంగా నగిషీలు చెక్కించినా, ఆ ప్రాంతంలో పూడ్చి పెడ్డింది ముంతాజ్ ఒక్కదాన్నే కాదు. షాజహాన్ ఇంకో భార్య సిర్హింద్ బేగం కూడా. ముంతాజ్ బేగం రాణిగారికి ఇష్టమైన పరిచారిక సతీఉన్నీసాకు కూడా అదే కాంప్లెక్సులో గోరీలు కట్టారు. ఆక్రమించిన రాజమహల్ ను బొందలదిబ్బగా మార్చాలనుకున్నారే తప్ప స్పెషల్ గా ముంతాజ్ దివ్యస్మృతికే దానిని శాశ్వత హారతిగా ఉద్దేశించలేదని దీన్నిబట్టే తెలుస్తుంది. రాణికి, పరిచారికకు ఒకే విధమైన సమాధులు కట్టించటాన్నిబట్టే షాజహాన్ దృష్టిలో రాణికి ఉన్న స్థానమేమిటో బోధపడుతుంది.