Its time to the common man to show the power of Democracy

Its time to the common man to show the power of Democracy

ఏం జరుగుతోంది మన రాష్ట్రం లో ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే తెలిసే చెడు నిజాలు ఏవి? ఎవరికీ వారే తమంతవారు లేరని ప్రజలముందు నిరుపించుకోవడానికి చేసే ప్రయత్నాలు మనకు నవ్వు తెప్పించక మానవు. ఒక ప్రక్క తెలుగు దేశం పార్టీ, ఒక వైపు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు కాంగ్రెస్ ఎవరికీ వారే వ్యూహాలు సిధం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక ప్రక్క ఉద్యోగులు, మరొకపక్క చిన్న పెద్ద పనులు చేసుకొనే వారు, విద్యార్ధులు, వ్యాపారస్తులు వీరు వారు అని లేకుండా ప్రతి ఒక్కరూ ఆంద్ర దేశం లో సమ్మెలు కొట్లాటల మధ్య నలిగి పోతున్నారు. ఎవరు పంతాలు విడి ముందుకు సాగే దిశగా అడుగులు వెయ్యాలి అనుకోవటం లేదు. 

ఈనాటికి డబ్భై రోజుల కు మించి సమ్మె కొనసాగు తున్నా ఎం జరుగుతోంది అని అడిగే నాధుడే లెదు. ఒక ప్రక్క కేంద్రం తన పని తాను చెసుకుపొతొన్ది. ఒక ప్రక్క విధ్యుత్ సమ్మె కారణం గా తగ్గినా విధ్యుత్ ఉత్పతి వాళ్ళ కారెంటు కోత, ఎంతోమంది పేదల రోజువారి కూలి పనులు లేక పొట్ట కూటికి బాధపడే ప్రజలు. ఈ సంవత్సరం చదువు ఏమవుతుందో నని బాధ పడే విధ్యర్ధులు. ఎవరికీ ఏవేమి పట్టవా?

ఎంతమంది భవిష్యత్తు నాశనం చేస్తున్నాము అని ఆలోచించేవారు లేరు. ఇది ఒక సమస్య గా భావించి భాద్యతాయుతంగా ప్రవర్తించే నాయకుడు గాని ఉద్యోగులు కాని నేడు ఆంద్ర దేశం లో కానరారు. రాజకీయ నాయకులు వారి భవిష్యత్తు సుస్థిరం చేసుకుందాము అని చూస్తున్నారు గాని ఈరోజు ఉన్న పరిస్థితికి  ఒక్క రాజకీయ పార్టీ కూడా తమ ఆధిపత్యం చాటుకునే అవకాసం లేదని మన రాష్ట్రం లో చిన్న పిల్లలు కూడా చెప్పగలరు. ప్రజలలో చైతన్యం వస్తే నిజం గా ఇప్పుడు ఉన్న ఏ ఒక్క పార్టీ ని గెలిపించకొదదు. మన భారతాన్ని కొత్త కలం తో వ్రాయవలిసిన అవసరం ఎంతైనా ఉన్ది. ప్రతి ఒక్క పౌరుడు కూడా తన హక్కును వినియోగించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోవలిసిన అవసరం ఎంతైనా ఉన్ది. మీరు కూడా పాఠకులుగా  కాకుండా భాద్యత గల పౌరులుగా స్పందిన్చావలిసిన అవసరం ఉన్ది. మన రాబోయే తరాలకు ఒక మంచి భవిష్యత్తు మార్గాన్ని ఈర్ష్యా ద్వేషాలు, భాష ప్రాంత వాదాలు లేని రాగద్వేషా రహితమైన రాష్ట్రాన్ని నిర్మించడానికి మనం ఇప్పుడైనా పూనుకోవాలి.