It seems Telugu Industry again gaining its nativity which it had lost years ago

చాలా కాలం గా మన తెలుగు సినిమా ఫీల్డ్ లో పర భాషా అభిమానం పర భాషా హీరోన్లను ఆదరించడం మనం చూస్తూనె వస్తున్నాం. కాని ఇప్పుడు రోజులు కొంచెం మారుతున్నట్టుగా అనిపిస్తొన్ది. మన మాతృభాష లో మాట్లాడగలిగే నటీమణులు చాలా కాలం క్రితం మన ఫీల్డ్ ను ఏలేవారు. కాని మధ్యలో పరాయి భాషా మోజులో పడి మనం మన అభినేత్రులను ఎంతో ప్రతిభావంతులైన నటులను వివిధ భాషలకు వదిలేసి సరి అయిన అభినయం గాని, భాష పటుత్వం గాని, ముఖ కవళికలు గాని లేక పోయినా కేవలం వాళ్ళ అంద చందాలతో మన ఫీల్డ్ లోకి చొచ్చుకు వచ్చి ఒంటె బిడారి వాని సామెత ను నిజం చేస్తూ మన వారికే సరైన స్థానం గుర్తింపు లేకుండా చేశారు.
మరి ఇప్పుడు అలాగ కాకుండా రోజులు మారుతూ ఉన్నట్లుగా అనిపిస్థున్నది. అన్ని మంచి శకునములే అన్నట్టుగా మన సొంత హీరోఇన్లు అయిన స్వాతి రెడ్డి లాంటి అమ్మాయిలు కూడా మంచి హిట్ లు సాధించగలరు అని మరింత బిజిగా తెలుగు లో నటించగలరు అని ఈ సొట్ట బుగ్గల సుందరి ఇటివల నిరుపిస్థొన్ది. ఇది ఒక మంచి మార్పు కి దారి తీస్తుంది అని ఆశిద్దాం. ఆమె బాట లోనే మరి కొందరు మన సినిమా లలో నటించి ప్రేక్షకులను అలరించి మన టాలీవుడ్ లో మహారాణి కిరీటం అందుకుంటారని ప్రజలలో తెలుగు పట్ల తగ్గిన ఆదరణను తిరిగి తెచ్చే ప్రయత్నం లో వారి వంతు కృషి చేస్తారని ఆశిద్దామ్.
ఈ మార్పు మన టాలీవుడ్ లో రావాలంటే దానికి సామాన్య ప్రేక్షకులుగా మన పాత్ర కూడా ఎంతో ఉన్ది. మన భాష చిత్రాలను, నటులను ఆదరించి అభిమానించి అక్కున చేర్చుకుంటే నే ఇది సాధ్యమవుతుంది. మనం మన బాధ్యత నిర్వర్తిస్తే మన భాష కుడా గుర్తింపు సాధిస్తుంది అని నా ప్రగాడ విశ్వాసం.