A man (Ranveer Singh) and woman (Deepika Padukone) from rival families fall in love.

A man (Ranveer Singh) and woman (Deepika Padukone) from rival families fall in love.

ఈ సినిమా చూసి రెండు రోజులైంది కానీ ఈరోజు దీని గురించి రాస్తున్నాను.

రామ్-లీలా సినిమాని బన్సాలి "రోమియో-జూలియెట్" నుంచి స్పూర్తి పొందినట్టు టైటిల్ లో పేర్కున్నారు. అందుచేతన ముందే ఈ ఇద్దరు చనిపోతారని నిర్ణయించేసుకుని ఎలా చనిపోతారో చూడడానికి సిద్ధపడిపోయాను.

బన్సాలి సినిమాలలో చుస్తే మనకి తెలియని ప్రపంచాన్ని ఒకటి పరిచయం చేస్తాడు ప్రతీ సినిమాలో... ఈ సినిమాను కూడా గుజరాత్ లోని ఒక చిన్న (లేని) ఊరిలో నడిపించాడు. రెండు గ్యాంగ్ లు. ఒకరికొకరికి పడదు. అది కూడా మాములుగా కాదు కనిపిస్తే ఒకరినొకరు కాల్చుకునేంత. అలాంటిది రెండు గ్రూప్ లకి చెందిన రామ్ లీలా ఇద్దరు ప్రేమలో పడతారు. ఇంక పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడండి. అందులోనూ రాం అన్నయ్యను లీలా అన్నయ్య చంపితే, అతడ్ని రామ్ చంపేస్తాడు. ఇన్ని గొడవల మధ్య వీళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా అనేది మిగతా కధాంశం.

హీరో-హీరొయిన్ కెమిస్ట్రీ భీభత్సంగా వర్క్ అవుట్ అయ్యింది. కొన్ని చోట్ల హద్దులు మీరింది కూడా.. కానీ ఇద్దరూ చాలా బాగా నటించారు. దీపిక తల్లిగా నటించిన ఆవిడ అయితే తన కళ్ళతోనే భయపెట్టేసింది. కెమెరా వర్క్, మ్యూజిక్ చాలా బాగున్నాయ్. మాటలు తూటాల పెల్తూనే నవ్వించాయి. రెండో సగం కొంచం నెమ్మదిగా నడవడంతో బోర్ కొడుతుంది కానీ సినిమా ఆద్యంతం అలరిస్తుంది.

ప్రేమలో గాడత్వాన్ని, నమ్మకాన్ని చక్కగా చూపించారు బన్సాలి. సావరియా, గుజారీష్ లాంటి సినిమాలతో విసిగిపోయి అతడి సినిమాలు చూడకూడదు అని నిర్ణయించుకున్న వారు ఎంచక్కా ఈ సినిమాని చూడొచ్చు.

(ఇదే రోమియో-జూలియెట్ ని స్పూర్తిగా తీసుకుని తెలుగులో బాబి అని కూడా తీశారు. అది ఏమైందో మీకు తెలుసు. )

Ram-Leela 2013 Film:

A man (Ranveer Singh) and woman (Deepika Padukone) from rival families fall in love.

Initial release: November 15, 2013
Director: Sanjay Leela Bhansali
Cinematography: Ravi Varman
Cast: Ranveer Singh, Priyanka Chopra
Music composed by: Sanjay Leela Bhansali, Monty Sharma
Production companies: SLB Films, Eros International