Our hearty condolences to the Star Comedian Dharmavarapu's family

Our hearty condolences to the Star Comedian Dharmavarapu's family

నిన్న రాత్రి మన తెలుగు సినిమా పరిశ్రమకు ఒక తీరని లోటు మిగులుస్తూ మన అందరికి ఎంతో ప్రీతిపాత్రమైన ధర్మవరపు సుబ్రహ్మణ్యం తీవ్ర అనారోగ్యం తో కన్ను ముసారు. మనందరికీ తెలిసిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒక హాస్య నటుడిగా ఎన్నో చిత్ర్రాలలో మనల్ని అందరిని కడుపుబ్బా నవ్వించారు. ఆయన నటించిన ఎన్నో చిత్రల్లో సంభాషణలు మనం ఎప్పటికి మర్చిపోలేము.

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక తెలుగు భాష కు సంబంధించిన ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో వారు ఎంతో చురుకుగా పాల్గొని ముఖ్య పాత్ర వహించెవారు.  ఆయన వయస్సు 53 సంవత్సరాలు. వారికి భార్య  ఇద్దరు కుమార్లు ఉన్నరు. వారిది ప్రకాశం జిల్లా కొమ్మినేనివారిపాలెం. 1979 నుండి దిల్సుఖ్నగర్ లోని శారద నగర్ లో వారి స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉన్నారు.  

కొంత  కాలంగా వారు స్వసకొశ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియ వచ్చింది. శనివారం రాత్రి తీవ్ర అస్వస్తతకు గురై ఒక ప్రైవేటు వైద్యశాలలో మృతిచెందినట్లు తెలియ వచిన్ది.  వారు సినిమా పరిశ్రమలో తనదైన ఒక శైలి తో మనల్ని ఎంతో ఆహ్లదపరిచారు. ఆయనకు నటుడిగా ఎంతో గుర్తింపు ఎన్నో పురస్కారాలు కూడా వచ్చాయి. చిత్ర పరిశ్రమకు తెలుగు భాషకు ఆయన చేసిన సేవ ఎనలేనిది. తెలుగు సినిమా ప్రేక్షకులు వారిని తమ హృదయాలలో ఎన్నటికి నిలుపుకుని ఉంటారు.  వారి ఆత్మకు శాంతి చేకూరాలని మా ములక్కాడ టీం ఆ భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా హృదయ పూర్వక ప్రగాడ సంతాపం తెలియజెస్తున్నమ్.