Telugu Screen Sita has expired

Telugu Screen Sita has expired

తెలుగు తెర సీతా దేవి మన అందరి అభిమాన పాత్రమైన పాత్రలను ఎన్నో పోషించి ఎంతో జనాదరణ చూరగొన్న అంజలి దేవి నిన్న చెన్నై లో కన్ను మూశారు. ఆమె 86 సంవత్సరముల వయసు కలిగి ఉన్నారు. వారు 1928 సంవత్సరం లో విజయదశమి రోజున జన్మించారు. వారు తెలుగు, తమిళ మరియు కన్నడ భాషలలో సుమారు 500 సినిమాలు నటించి ఉన్నారు. వారు ఎన్నో పురస్కారాలు కూడా అన్దుకొన్నరు. వారు పోషించిన అన్ని పాత్రలలో కెల్లా లవకుశ చిత్రం లోని ఆమె నటించిన సీత పాత్ర ప్రజల గుండెల్లో మరువలెనిదిగా నిలిచిపోయినది.

ఆమె మరణం ఎంతోమందికి బాధను మిగిల్చి పోయిందంటే ఆశ్చర్యం లేదు. ఆవిడ ఆత్మ కు శాంతి కలగాలని మనస్పూర్తిగా ప్రర్ధిస్థున్నము. ఆమె నటిగానే కాక ఒక నిర్మాతగా కూడా మంచి చిత్రాలను నిర్మించి ఉన్నారు. ఆమె నిర్మించిన చిత్రాలలో అనార్కలి, భక్త తుకారాం వంటివి మచ్చు తునకలు.