Main attraction of Sankranthi is Cock fights and play cards attract most

Main attraction of Sankranthi is Cock fights and play cards attract most

ఉభయ  గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. అనాదిగా కోళ్ళ పందాలు, పేకాట ఈ పండుగ  వేడుకల్లో ముఖ్య పాత్ర వహిస్తూ వస్తున్నై. ఏటా ఈ పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయన్న వాస్తవం అందరికి విదితమే అయినా ఎవరూ దీనిని ఆపలేక  పోతున్నారు. ఈ పందాల్లో పోటికి ముందే డబ్బులు చేతులు మారతాయి. కోళ్ళకు కాలికి కత్తులు కట్టి అవి కొట్టుకుంటూ  ఉంటె దానిని చూసి ఆనందించటం ఒక వినొదమ్. ఇవన్నీ పోలిసుల కన్ను గప్పి ఏళ్ల తరబడి సాగుతూనె ఉన్నై. మన వినోదం కోసం అమాయక మూగ జీవుల ప్రాణాలతో చలగాటం ఆడడం ఎంత మాత్రం సబబు కాదని విన్నపం. మన వేడుకలను ఆనందంగా గడపడం కోసం వాటిని బాలి తీసుకోవడం ఎంత వరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి.