Do respond for good thoughts and reasons than gossips

Do respond for good thoughts and reasons than gossips

ఉదయ్ కిరణ్ మృతి నిజంగానే ప్రజలలో ఎన్నో ఉహాగానలకు తెర తీసింది. ఆత్మహత్య చేసుకునేంత అవసరం తనకి ఏముంది అనేది ప్రస్తుతం అందరినీ వేదిస్తున్న ప్రశ్న. ఎన్నో కదా కధనాలు ఈ విషయం లో వెలుగు లోకి వచ్హాయి. అన్ని ప్రధాన వార్త పత్రికలూ టి వి  చానెళ్ళు వారికి తోచిన కధనాలను ప్రచురించి ప్రసారం చేసి వారి వారి రేటింగ్ లు పెంచుకునే ప్రయత్నం లో విషయాన్ని ఎక్కడికో తిసుకుపొయరు.

బాధాకరమైన విషయం ఏమంటే ఆటను ఎందుకు ఆత్మా హత్య చేసుకున్నాడో అసలు విషయం పక్కన పెట్టి అతనికి సంబంధించిన అందరిని బయిటికి లాగి భార్యను, మేనేజర్ ను, అత్తవారిని, తండ్రిని, నిర్మాతలను, సినీ పరిశ్రమకు సంబంధించిన అందరిని ఇంచుమించుగా ఈ విషయం లో అందరికి సంబంధం ఉన్నట్లుగా వచ్చే ప్రతి కధనం అందరిని ఎంతో కలవార పరుస్తోంది.

విలేఖరులుగా పాత్రికేయులుగా పత్రికా సంపాదకులుగా మనకి  సమాజానికి మంచి చేసే బాధ్యత నిజ నిజాలను తెలుపవలిసిన అవసరం అంతో ఉన్ది.  మన మాటలకు మన రాతలకు ఎంతో విలువ ఉన్ది. సమాజం ప్రభావితం అయ్యే విధం గా పాత్రికేయుల రాతలు ఉన్దాలి. సమాచార చానెళ్ళ ప్రసారాలు ఉండాలి. నిజాన్ని పక్కద్రోవ పట్టించి ఆసలు ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యే కాదు హత్య అని నిరూపించే లా ఉన్న వ్రతలవల్ల ఎవరికి లాభం ఉంది? ఉదయ్ కిరణ్ జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి అని అందరికి తెలిసిన విషయమే. కాని మనం క్షనికావేసం లో చేసుకునే కొన్ని నిర్ణయాలవల్ల కొన్ని పనుల వాళ్ళ మిగిలిన వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు ఎంతగా ఇబ్బందులు పడతారో మనం అందరు తెలుసుకోవలిసిన విషయం. ఇంతకుముందు జరిగిన ఎన్నో ఆత్మహత్యల  వెనుక ఉన్న కారణాలే దిని వెనుక కూడా ఉన్నది  అన్నది తెలుసుకోవలిసిన నిజమ్.

సమాజం నేడు ఇతరుల విషయాలలో తనకు అవసరం ఉన్నప్పుడు కాక వారికి అవసరం ఉన్నప్పుడు వారికి ఆనందాన్ని ఇచే విషయాలు ఉన్నప్పుడు పట్టించుకోవడం దురదృష్టకరం. నిజంగానే అతడిపట్ల ఇంత బాధ్యత ఉన్న పక్షం లో మనం అతడు బ్రతికి ఉన్న క్షణం ఎప్పుడు అతడిని అడగనే లేదు. ఈరోజు ఇంతగా వాపోయేవారు తనబాధాల్లో (నిజంగా ఉన్నట్లయితే) ఏరోజు అడగలెదేమి. ఎప్పుడూ కలకలం రేపే వార్తలు మనకి కావలి. ఆ వార్తలు ప్రచురించడం వాటిని చదివి విని చూసి ఆనందించడం ఎంత వికృతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి పాటకులారా... ఇలాంటి విషయాలను ఎప్పుడైతే మనం శ్రద్ధగా నాలుగురొజులు విని ఆనందించి తర్వాత ఏమి జరగనట్టు మర్చిపోతు ఉంటామో అంతవరకు మన సమాజం లో మార్పు రదు. స్పందించే హృదయాన్ని కోల్పోతున్న మనం ఎంతైనా ఈవిషయం లో స్పందిన్చావలిసిన అవసరం ఉన్ది. ప్రజలారా మేల్కోండి. ఇలాంటి ఉదయ్ కిరణ్ లు మరికొందరు రాకముందే మార్పు తీసుకురావడానికి ప్రయత్నించండి. మనకి ప్రతి ఒక్కరికి సమాజం  పట్ల బాధ్యత ఉందని తెలుసుకోండి. సినీ ప్రముఖులలో ఎవరికీ ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరు ఎవరిని వదిలేసారు, ఎవరు సెలవలు ఎక్కడ గడిపారు లాంటి చవకబారు విషయాలకు సమయం కేటాయించడం మాని కొంచెం బాధ్యతా యుతమైన విషయాలకు స్పందిస్తే ఇలాంటివి ఎన్నో జరగక ముందే మనం ఆపగలం అన్నది మా అభిప్రయమ్.