It seems we have forget the originality of festivals

It seems we have forget the originality of festivals

ఈరోజు ఉదయాన్నే లేచి ముగ్గు పెడుతూ ఉంటే నాకు మా అమ్మ మా చిన్న తనం గుర్తుకు రాసాగింది. విషయం ఏమంటే ఈరోజు సంక్రాంతి కదా ఏం చేద్దాం అంటూ మా చిన్న అబ్బాయి నా మెడ చుట్టూ చేతులు వేసి ఎంతో గోముగా అడుగుతూ ఉంటే ఏమి చెయ్యాలి నాన్నా అంటూ నా స్వగతం లోకి వెళ్ళిపోయాను కాసేపు. మా చిన్నతనం లో అమ్మ వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మ ఇంటికి పండుగకి వెళ్ళే వాళ్ళం. అది ఒక పెద్ద ఇల్లు. అమ్మమ్మ, తాతగారు, మావయ్యలు, అత్తలు, వాళ్ళ పిల్లలు, మేము, మా దొడ్డమ్మ వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఎంతో సందడిగా గడిచేది పండగ మూడు రోజులు.

మేము ముందుగానే వెళ్ళే వాళ్ళం. ఇల్లంతా మా అమ్మ అమ్మమ్మ అత్తలు అందరు కలిసి ముగ్గులు తీర్చి దిద్డేవాళ్ళు. మధ్యాహ్నం అందరు కలిసి జంతికలు, చేగోడీలు, అరిసెలు, మినపసున్ని, మైసూర్ పాక్ లాంటి ఎన్నో నొరూరించె పిండి వంటలు ముందుగా చేసి పెట్టుకునే వారు. మధ్యలో మేము అందరమూ చేతులు చాచి మాకో అంటూ చేస్తున్నవి చేస్తూనే తిన్తూ అనన్దిస్తూ ఉండేవాళ్ళం.

భోగి నాడు ఉదయాన్నే లేచి అందరు వేడి నీళ్ళు, కుంకుడు కాయలు అంటూ పరుగులు తీస్తూ స్నానాలు ముగించే వారు. పిల్లలకి అయితే ఎంత సన్దదో చెప్పలేం. ముందుగా నేను అంటే నేను అంటూ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని దేవుడికి నమస్కరించి ఇంటిలో పెద్దవాళ్ళు అందరికి నమస్కరించి భోగి మంట దగ్గిరకి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం.

ఆరోజు పులిహోర, బూర్లు, బొబ్బట్టులు అంటూ ఇంకొన్ని నోరూరించే పిండి వంటలు అన్ని కలిపితే పండుగ. అదే కాదు ఇంటికి వచ్చే పోయే చుట్టాలు, కొన్ని కాలక్షేపం కబుర్లు, కొత్త బట్టలు, పేరంటాలు, ఆడపిల్లల గొబ్బిళ్ళు, నగలు, ఇలా పండగనాడు ఎన్నెన్ని చెయ్యవచునొ తలుచుకున్తూ ఉంటె మా అబ్బాయి అడిగిన ప్రశ్న కి ఎంత పెద్ద జవాబో నాకే తెలియలేదు. ఎప్పుడూ ఆట పాటల్లో ములిగి తేలే ఆ పసి హృదయాలకు ఎలా చెప్పేది, ఏమి చెయ్యాలో! అయినా ఇప్పటి పిల్లలకు మనం కాక పోతే ఇంకెవరు చెబుతారండి?

కావున మన పిల్లలకి తల్లి తండ్రులుగా మన బాధ్యతను నెరవెరుస్థూ తరచూ కాక పోయినా అప్పుడప్పుడు ఇవన్ని తెలిసేలా చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అనుకుంటూ మల్లి నా పనిలో ములిగి పొయను. మాటల్లో పది మర్చిపోయాను, మా వారు లేచినట్టు ఉన్నారు కాఫీ ఇవ్వాలి సుమా.. మల్లి మాట్లాడతా ఇలాంటి మరొక విషయం తో ....