Festival mood all over the state and country can be seen

Festival mood all over the state and country can be seen

రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొంటున్నారు. ముందుగా మా పాటకులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి ఏరోజు జరుపుకోవాలని అనే మీమాంస అనేకమందిలో ఉన్న కొంత మంది ఈరోజు భోగి జరుపుకుంటూ ఉంటే మరి కొందరు రేపు జరుపుకుంటున్నారు.

సంక్రాంతి వచ్చిందంటే  చాలు పిల్లలు పెద్దలు అందరు ఎంతో ఉత్సాహం గా తమ తమ వంతు ఏర్పాట్లు  చేసుకుంటూ ఉంటారు. ప్రతీ ఇంటి లోగిలిలో ఎంతో అందంగా తీర్చి దిద్దే ముగ్గులు, ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు, ఉదయాన్నే తంబురా వాయిస్తూ పాట పాడుతూ వచ్చే హరిదాసులు, ఎంతో అద్భుతంగా అలకరించబడిన గంగిరెద్దులు, వాటిని తోలుకు వచ్చే వారు, వచ్చే పోయే చుట్టాలు, ఘుమ ఘుమలాడే వంటిల్లు, అత్తవారింటికి వచ్చే కొత్త అల్లుళ్ళు ఇలా ఎంతో ఆనందంగా  ఉండే ఆ సంక్రాంతి కళ పల్లెసిమల్లొనె చూడాలి.

నేటి పట్న వాస గజి బిజీ జీవితాల్లో సంక్రాంతి లాంటి మన సంస్కృతిని గుర్తుకు తెచ్చే ఈ విషయాలు మచ్చుకి కూడా కనపడటం లేదు అంటే విచిత్రమేమి కాదు. ఏది  ఏమైనా ఈ పండుగ మనది. దీనిని అన్దరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని మా అకాంక్ష.