My office my home

My office my home

ఆఫీసు అంటే రెండవ ఇల్లు అనే మాట కొంత హాస్యాస్పదంగా ఉన్న ఈరోజు ఉద్యోగం చేసే ప్రతివాళ్ళు ఎక్కువగా గడిపే చోటు వాళ్ళ వాళ ఆఫీసు కాక మరేముంటుంది. ఉదయం ఇంటినుంచి 9 గంటలకు లేదా 8:30 కి బయల్దేరిన వారు వెనక్కి వచ్చే సమయం చెప్పమంటే కష్టం. ఉదయం వెళ్తూనే కాఫీ, ఫలహారం, మధ్యాహ్నం భోజనం మళ్లీ సాయంత్రం చిరుతిండి కాఫీ లేదా టీ అన్ని అక్కడే. ఇవన్ని కంపెనీల వాళ్ళు వాళ్ళకు ఇచ్చే సౌకర్యలు అని చెపుతూ వారిని ఆఫీసు నుండి కదలకుండా పని చేయించుకునే పధకాలలో చెప్పకనే విజయం సాధిస్తున్నారు. మనం ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఇంటిలో అమ్మ లేదా భార్య చేతి వంట వారానికి ఒక్క రోజో రెండు రోజులో తప్ప మిగిలినది అంతా బయట భొజనమె. అక్కడ క్యాంటీన్ లో పెట్టె ఆహార పదార్ధాలలో శుభ్రత ఎంతగానో పాటిస్తారు గాని ఆప్యాయతతో వడ్డించే చేతులు కరువైపోతాయి అంటే ఆశ్చర్యం లేదు.  
ఇవన్నీ ఒక పక్కన పెడితే ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీసు లో గడిపిన ఒకప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి చేరి భార్య పిల్లలతో తల్లి తండ్రులతో కబుర్లు, కాలక్షేపం, బంధువుల ఇళ్ళకి, సినిమా కి షికారుకి అంటూ ఎక్కడికో ఒక చోటికి వెళ్లి రోజంతా పడిన అలసటను మర్చిపొయెవారు. మరిప్పుడు ఉదయం వెళ్ళిన వారు రాత్రి అందరు నిద్ర పోయే సమయానికి ఇంటికి చేరుతారు. మరి ఇంటికన్నా ఎక్కువ సమయం తాము గడిపే వారి వారి ఆఫీసు విషయం లో చాల శ్రద్ధ తీసుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది.
ముఖ్యంగా ఆఫీసు లో మీరు కూర్చునే కుర్చీ మీకు సౌకర్యమ్ గా ఉందొ లేదో చూసుకోవడం ఎంతో అవసరం. మీరు కూర్చునే కుర్చీ మీ ఎతుకు, మీ లావుకు తగినదిగా ఉండాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు మీ కాళ్ళు కింద ఆనేలా ఉన్దాలి. మీరు నిటారుగా కుర్చుని పని చేసేలా ఉండాలి. మీరు ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేసేటట్టు అయితే మీ కళ్ళు దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళకు అంటి-గ్లేర్ అద్దాలు వాడడం ఎంతో మంచిది. మీరు పని చేసే చోటు ఉన్న ప్రతి వస్తువు మిమ్మల్ని ఆహ్లాదపరిచేదిగా ఉంటె మీ పని మరింత ఉత్సాహంగా చేసుకో గలుగుతారు. దానికి మీరు మీ టేబుల్ పై ఏదైనా అలంకరణ వస్తువులు వాడడం మంచిది. అవి పువ్వులు అయితే ఇంకా మంచిది. ఆ పువ్వులు రోజు మార్చేవిగా సన్నని పరిమళాన్ని కలిగి ఉంటె ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది.
మీ ఆఫీసు బల్ల మిద ఉన్న టేబుల్ క్లోత్ తేలిక రంగులలో ఉండి దానిపై గజిబి చిత్రాలు ఉండకుండా చూసుకోండి. మీ టేబుల్ పై మీకు ఎంతో ఇష్టమైన మీ పిల్లలు, మీ భార్య లేదా భర్త లేదా మీరు ఎంతగానో ఆరాధించే మీ తల్లి దండ్రులు లేదా దేవుని ఫోటో పెట్టుకుంటే అటువైపు చూసే ప్రతిసారి మీ మనసుకు ఎంతో తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీ సహోద్యోగులతో అప్పుడప్పుడు నవ్వుతూ రెండు మాటలు మాట్లాడి మళ్లీ మీ పనిలోకి జారుకోవడం మీకు మీ తోటి వారికి కుడా మీ పట్ల గౌరవాన్ని మరియు పని పట్ల ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇవన్ని చేస్తూ పని చెయ్యటం వల్ల మీకు పని వత్తిడి తక్కువగా ఉండి పని చెయ్యడం సులువుగా ఉంటుంది.  అంతే కాక మీరు చేసే పనిలో మీకు నేర్పరితనం కూడా పెరిగి మీ ఉన్నతోద్యోగుల మెప్పు పొందే అవకాసం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.