Watch Highway movie trailer online and review

Watch Highway movie trailer online and review

Highway Review

శుక్రవారం ఉదయం ఈ సినిమా చూసిన తర్వాత అదే రోజు వరసుగా నాలుగు సినిమాలు చూసినా నా మదిలో ఇంకా కదలాడుతూనే ఉంది. ఇప్పటికి కూడా! కొన్ని సినిమాలు అంతే. మనకి తెలియకుండానే మన మీద గాఢ ముద్రను వేస్తాయి. అంతలా ఏముంది ఈ సినిమాలో? రెండు జీవితాలు.

చిన్నప్పుడు కళ్ళ ముందే తాగుబోతు తండ్రి తన తల్లిని కొడుతున్నా, ఆమె ఎన్ని కష్టాలు పడినా నిస్సహాయంగా చూస్తూ పెరిగిన మహబీర్ భాటియా... తన ఎనిమిదేళ్ళ వయసప్పుడు "నువ్వు ప్రపంచంలో కల్లా అందగత్తెవు" అంటూ చాక్లెట్స్ ఇచ్చి, ఎవరూ లేనప్పుడు తనపై అత్యాచారం చేస ే మావయ్యను, అతడి చేష్టలను తలచుకుంటూ కుమిలిపోతూ పెరిగిన వీరా త్రిపాతి... ఈ ఇద్దరి కథ "హై వే"

"నన్ను ఎక్కడి నుంచి తీసుకువచ్చావో అక్కడకి తిరిగి వెళ్ళాలని లేదు. నువ్వు తీసుకెళ్లబోయే గమ్యాన్ని చేరాలని లేదు. నాకు ఈ ప్రయాణం నచ్చింది. ఇలాగే ఈ హై వే మీద సాగిపోవాలని ఉంది." ఇంటర్వెల్ సీన్ లో వీరా అంటుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ మనమూ అలానే ఫీల్ అవుతాం. ఆ ప్రయాణాన్ని ఆశ్వాదిస్తాం...

నేను కథ చెప్పను. ఎందుకంటే, ఇద వినాల్సిన, చదవాల్సిన కథ కాదు. చూడాల్సిన కథ. రెండు భిన్న నేపధ్యంలో నుంచి వచ్చిన ఇద్దరి ప్రేమ కథ. కాదు, జీవిత గాధ.

***

అలియా భట్, రందీప హూడా అధ్బుతంగా నటించారు. అలియా నటన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ అమ్మాయేనా "స్టూడెంట్ అఫ్ ది ఇయర్" లో చేసినది అని... మంచి దర్శకుడి చేతిలో పడితే ఇంతేనేమో... ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు సీన్ లో అలియా చిన్నప్పుడు తన మీద జరిగిన అత్యాచారం గురించి చెప్పినప్పుడు చూడాలి ఆమె నటన... ఆ ఒక్క సీన్ గురించైనా సినిమా చూసేయోచ్చు.

మాటలు చాలా చక్కగా రాసాడు ఇంతియాజ్.

* వీరా మొదటసారి గన్ పట్టుకున్నప్పుడు అడుగుతుంది, "ఈ బులెట్ తో ఒక మనిషి చనిపోతాడు కదా?"
"లేదు. ఇద్దరు... ఒకరు కాల్పుడికి గురైనవారు, ఇంకొకరు కాల్చిన వారు."

* "నీకు సముద్రం ఇష్టమా, పర్వతాలు ఇష్టమా?"
"నేనెప్పుడూ సముద్రం చూడలేదు."
"నాక్కూడా పర్వతాలంటే చాలా ఇష్టం"

****

ఇంతియాజ్ ఈ సినిమాతో చాలా చెప్పాలనుకున్నాడు. అన్నీ అందరికీ అన్నీ చేరి ఉండకపోవచ్చు. అతడు తీసుకున్న నేపధ్యంలో "ఆక్షన్" కి చాలా ఆస్కారం ఉంది. పోలీస్లని మొహరించేసి, వీర లెవెల్ లో చేజ్ లు, ఫైట్ లు చేసుకునే అవకాశం ఉంది. కానీ వాటి జోలికి పోలేదు అతడు. అంతే కాకా అరగంటకి "confilct", ఇంటర్వెల్ కి బాంగ్ లాంటి కొలతలు వేసుకోలేదు. అతడు చెప్పాలనుకున్న కథను నమ్ముకుని ఎటువంటి హంగులకి పోకుండా తను అనుకున్నది మాత్రం తీశాడు. అందుకు అతడ్ని మనస్పూర్తిగా అభినందించాలి.

హిందీ సినిమా ఈ రెండేళ్లలో చాలా మారింది. ఆ మార్పు 2013 లో కొట్టిచ్చినట్టు కనిపించింది. ఇంక ఈ సంవత్సరం ఆరంభంలోనే అద్భుతమైన సినిమా వచ్చింది. ఇంకా మరిన్ని రావాలని వేచి చూద్దాం.. ఆలోగా ఈ సినిమా చూసేయండి.


About Highway Movie


Jab We Met maker Imtiaz Ali is completely taken aback with the latest development regarding his upcoming release Highway as it has been selected at the prestigious Berlin International Film Festival. He also said that he used to feel such big platforms are reserved for filmmakers like Anurag Kashyap.

Imtiaz, who is the name behind films like Love Aaj Kal and Rockstar, said, "I felt that only efficient and creative filmmakers like Anurag Kashyap can go to film festivals and to these glamorous cities. This is the first time that a film of mine has been invited to a festival." The director was talking at the promotion of the film in Delhi and he added further, "It is the first for me, first for Aliya and people around me are very excited.

Frankly this movie was not made for hitting the festival but it is there and I hope it opens door for filmmakers as well." Highway, to be released on February 21, stars Randeep Hooda and Alia Bhatt in the lead and it will have its world premiere at the film fest's Panorama section.

Imtiaz was asked if he has made any changes in his filmmaking style over the last few years and he replied, "I feel as a director, I have the capability to making different kind of stories with different kind of cinematic expression. I would like to make a full on 'nach-gana' film without having any qualms about it, without trying to be intellectual about it. And I would also make a film like 'Highway'... It just seems incongruous." Imtiaz's films are mostly focussed on his heroines and they leave a deep-seated footprint on the viewers' minds.

For example we can never forget his characters like Aditi in Socha Na Tha, Geet in Jab We Met and Meera in Love Aaj Kal. He said about the same, "I don't think from their (women) perspective. I am interested in them and their influence upon me has been quite interesting. I think its fascination. Sometimes the traits of my women characters might overlap with each other. But intrinsically they are different from each other.

There might be some frequencies that resonate together but not always." When asked why he preferred newcomer Alia over so many experienced actresses for the role in Highway he said, "Alia was perfect for this role.

She is not just young but has the heart and maturity to grasp things happening around. So getting an older girl for the part would not have been right for the film."